మడమల నొప్పితో నడవలేకపోతున్నారా..? ఇలా చేసి చూడండి

-

పైకి కనిపిచ్చే నొప్పులు కొన్ని ఉంటే కనిపించని నొప్పులు ఇంకొన్ని ఉంటాయి. తలనొప్పి, కాళ్ల నొప్పులు లాంటివి పైకి ఏం కనిపించవు. కానీ వీటి వల్ల వచ్చే భాద మాత్రం వర్ణాణాతీతం. మడమలు(మెడంసూలలు) నొప్పి వల్ల నడవటం చాలా కష్టం అవుతుంది. అడుగుతీసి అడుగు వేయాలంటే నరకం అనిపిస్తుంది. సాధారణంగా షుగర్‌ ఉన్నవాళ్లకు ఈ నొప్పి ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు ఊబకాయం, అధిక బరువు, అర్థరైటిస్, తదితర అనారోగ్య సమస్యలు కూడా మడమనొప్పికి దారితీయవచ్చు. మడమ నొప్పి ఉన్నప్పుడు నడవడం కష్టంగా ఉంటుంది, దీనిని నిర్లక్ష్యం చేస్తే పాదాలకు శ్రమ కలిగించడం వలన మడమ నొప్పి మరింత తీవ్రం అవుతుంది, అరుదైన సందర్భాల్లో సర్జరీ కూడా చేయాల్సి రావచ్చు. మడమ నొప్పి నుంచి ఉపశమనం కలిగించే ఆ ఇంటి నివారణలు ఏమిటో ఇక్కడ తెలుసుకోండి.

అలోవెరా

అలోవెరాలో బయోయాక్టివ్ కాంపోనెంట్స్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి ప్లాంటార్ ఫాసిటిస్ వల్ల కలిగే మంటను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది క్రమంగా, మడమ నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది. గోరువెచ్చని నీటి టబ్‌లో అలోవెరా జెల్ వేసి కనీసం 20 నిమిషాలు మీ పాదాలను నానబెట్టండి. మడమనొప్పి నుంచి ఉపశమనం ఉంటుంది.

విటమిన్ డి

అరికాలి ఫాసిటిస్ ఉన్న రోగులలో విటమిన్ డి లోపం కారణంగా మడమ నొప్పి రావచ్చు. విటమిన్ డి తగినంత మోతాదులతో సప్లిమెంట్ చేయడం వలన నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. పాలు, పుట్టగొడుగులు, గుడ్డు పచ్చసొనలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ డి లోపాన్ని ఎదుర్కోవటానికి మీరు వాటిని మీ ఆహారంలో చేర్చుకోవచ్చు.

విల్లో బార్క్

కొండ గన్నేరు చెట్టు బెరడు లేదా విల్లో బార్క్ అరికాలి ఫాసిటిస్ వల్ల కలిగే నొప్పిని ఎదుర్కోవటానికి చాలా బాగా సహాయపడుతుంది. నీటిలో విల్లో బెరడు వేసి ఐదు నుండి 10 నిమిషాలు ఉడకబెట్టండి. ఆపై 20 నుండి 30 నిమిషాలు పక్కన పెట్టండి, అనంతరం ఈ నీటిని వడకట్టి టీ రూపంలో తీసుకోండి. రోజూ రెండు కప్పుల టీ నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.

లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్

లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ నొప్పి తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. కొబ్బరినూనె లేదా ఆలివ్ నూనెలో ఒకటి నుండి రెండు చుక్కల లావెండర్ ఆయిల్ మిక్స్ చేసి ఆ మిశ్రమాన్ని మీ పాదాల అడుగు భాగంలో మసాజ్ చేయవచ్చు. నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి మీరు గోరువెచ్చని నీటిలో కొన్ని చుక్కల లావెండర్ నూనెను కూడా వేసి మీ పాదాలను అందులో నానబెట్టవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version