ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసినా చాలామంది కూల్డ్రింక్స్ ని తాగుతూ ఉంటారు. కూల్డ్రింక్స్ ని తాగితే కొన్ని ఇబ్బందులు తప్పవు. కూల్ డ్రింక్స్ ని తాగడం వలన ఎముకలపై ప్రభావం పడుతుందట. అయితే సాధారణంగా షుగరీ డ్రింక్స్ ని తీసుకుంటే బరువు పెరిగిపోవడం, గుండె సమస్యలు, షుగర్ వంటి సమస్యలు వస్తాయి. కానీ ఎముకలపై ప్రభావం పడుతుందని చాలా మందికి తెలియదు. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ కూల్ డ్రింక్స్ తీసుకోవడం వలన ఫ్రాక్చర్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుందని చెప్పింది.
అమెరికన్ జోనల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రీషియన్ ప్రకారం కోలా తీసుకోవడం వలన బోన్ మినరల్ డెన్సిటీ తగ్గుతుందని.. ముఖ్యంగా మహిళల్లో తగ్గుతుందని తెలిపింది. చాలా సాఫ్ట్ డ్రింక్స్ లో కొన్ని పదార్థాల వలన ఎముకల ఆరోగ్యం దెబ్బతింటుందట. కూల్డ్రింక్స్ లో ఉండే కెఫిన్ అలాగే ఫాస్ఫరిక్ యాసిడ్ వలన ఈ సమస్య వస్తుందట.
ఎముకలు ఆరోగ్యంగా ఉండడానికి క్యాల్షియం చాలా ముఖ్యం. క్యాల్షియం తగ్గితే ఎముకలు ఇబ్బంది కలుగుతుంది. అయితే చాలా కూల్ డ్రింక్స్ లో కెఫిన్ అలాగే ఫాస్ఫరిక్ యాసిడ్ ఉంటుందట, వీటి వలన ఎముకల సమస్యలు కలుగుతాయి. ముఖ్యంగా తక్కువ కాల్షియం ఉన్న వాళ్ళలో ఈ సమస్య ఎక్కువ అవుతుందట. రెగ్యులర్ గా సాఫ్ట్ డ్రింక్స్ ని తీసుకోవడం వలన బోన్ తిన్నింగ్ వంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కూల్ డ్రింక్స్ లో షుగర్ ఉన్నప్పటికీ కెఫిన్, ఫాస్ఫరిక్ యాసిడ్ కూడా ఉంటాయి. సో ఎముకలకు ఇబ్బంది కలుగుతుందని గుర్తుపెట్టుకోండి.