గురక వల్ల నలుగురిలో మీ పరువు పోతుందా..? గురక తగ్గాలంటే ఇలా చేయండి

-

చాలాసార్లు మనకు తెలియకుండానే పక్క వాళ్ళని ఇబ్బంది పెడతాం. అవతలి వాళ్ళు ఇబ్బంది పడ్డారని చెప్తే కానీ మనకు ఆ విషయం అర్థం కాదు. అలాంటి ఇబ్బందుల్లో గురక కూడా ఒకటి. ఎస్.. గురకపెట్టేవాళ్లు జోరు మీద నిద్రపోతారు, కానీ పక్కనున్న వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది.

చాలా మటుకు రిలేషన్స్ లో గురక పెద్ద సమస్యగా మారుతుంది. తమ పార్ట్ నర్లు గురకతో ఇబ్బంది పెడుతున్నారని కంప్లైంట్స్ సహజంగా వస్తూనే ఉంటాయి. ఈ గురక ఇబ్బందిని పోగొట్టాలంటే కొన్ని పనులు చేయవచ్చు. అవేంటో తెలుసుకుందాం.

పడుకునే పొజిషన్ ని మార్చండి:

ఇది చాలా సింపుల్ చిట్కా. వెల్లకిలా పడుకోవడం వల్ల గురక ఎక్కువగా వినిపిస్తుంది. అందువల్ల పక్క మీద పడుకుంటే గురక శబ్దం తగ్గుతుంది.

బరువు తగ్గండి:

బరువు తగ్గడం వల్ల గురకపోతుందా అంటే అందరిలో పోదు. కొంతమంది సన్నగా ఉన్నా కూడా గురక పెడతారు. బరువు పెరగక ముందు మీకు గురక రాకుండా.. పెరిగిన తర్వాత మాత్రమే గురక వస్తుంటే బరువు తగ్గడం వల్ల గురక తగ్గిపోయే అవకాశం ఉంది.

కావలసినంత నిద్ర:

మనిషికి నిద్ర చాలా అవసరం. ఒకరోజు ఎనిమిది గంటలు నిద్రపోయి మరొక రోజు నాలుగు గంటలు నిద్రపోవడం కరెక్ట్ కాదు. మీరు నిద్రపోయే గంటలు క్రమక్రమంగా వేరువేరుగా ఉంటే మీకు గురక వస్తుంది. కాబట్టి ప్రతిరోజు కనీసం 8 గంటల నిద్రపోండి.

ఆల్కహాల్ అస్సలు ముట్టుకోవద్దు:

ఆల్కహాల్ తాగే అలవాటు ఉన్నవాళ్ళకి కూడా గురక సమస్య ఉంటుంది. ఈ అలవాటు మానిపోతే గురక తగ్గే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా నిద్రపోవడానికి నాలుగు గంటల ముందు ఆల్కహాల్ తీసుకోకుండా ఉంటే గురకరాకుండా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news