ఏపీలో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమితో కలిసి టీడీపీ సునామీ సృష్టించిన విషయం తెలిసిందే. అయితే టీడీపీ గెలుపుకు చంద్రబాబు, లోకేష్ తో పాటుగా భువనేశ్వరి, బ్రాహ్మణి కూడా చాలా ప్రచారం చేసారు అనేది తెలిసిందే. ఈ ప్రచార సమయంలోనే మంగళగిరిలో ఇచ్చిన హామీని తాజాగా నెరవేర్చారు నారా బ్రాహ్మణి. ఎన్నికల సందర్భంగా తమను కలిసిన నారా బ్రాహ్మణికి కూరగాయల వ్యాపారులు ఓ అభ్యర్థ తెలియజేసారు.
తమకు కూరగాయలు అమ్ముకునేందుకు సరైన స్థలం లేక ఇబ్బందులు పడుతున్నామని.. నారా బ్రాహ్మణికి తెలిపారు కూరగాయల వ్యాపారులు. అయితే ఎన్నికల ప్రచార సమయంలో తన దృష్టికి వచ్చిన ఈ సమస్యను అధికారులకు చెప్పారు నారా బ్రాహ్మణి. అయితే తాజాగా ఈ సమస్య పరిష్కారానికి కూరగాయల వ్యాపారులకు స్థలాన్ని కేటాయించారు మునిసిపల్ అధికారులు. అయితే తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన నారా బ్రాహ్మణికి కృతజ్ఞతలు తెలిపారు కూరగాయల వ్యాపారులు