జ్ఞాపకశక్తి పెరగాలంటే మీ డైట్ లో వీటిని తీసుకోండి..!

-

వీటిని కనుక మీ డైట్ లో తీసుకుంటే జ్ఞాపకశక్తి (memory)  సులువుగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మానసిక ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి పండ్లు, కూరగాయలు బాగా ఉపయోగపడతాయి. అదే విధంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా సహాయపడతాయి. ఆకు కూరలు కూడా బ్రెయిన్ హెల్త్ కి మంచిది. నట్స్, గింజలు వంటివి కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

 

memory | జ్ఞాపకశక్తి

జ్ఞాపకశక్తి పెంచుకోవడానికి తీసుకోవాల్సిన ఆహారం:

జీడిపప్పు:

జీడిపప్పు జ్ఞాపక శక్తిని పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది. దీనిలో పాలీ సాచురేటెడ్ ఫ్యాట్స్ మరియు మోనో సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి ఇవి బ్రెయిన్ కి చాలా అవసరం.

బాదం:

బాదం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది బ్రెయిన్ లో అసెటిల్ కొలిన్ లెవెల్స్ ని పెంచుతుంది దీనిలో విటమిన్ బి6, జింక్, ప్రొటీన్ కూడా ఉంటాయి. ఇవి బ్రెయిన్ హెల్త్ కి చాలా మంచిది.

గుమ్మడి గింజలు, ఫ్లాక్స్ సీడ్స్:

ఇవి రెండూ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా బ్రెయిన్ కి చాల మంచివి. ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. వీటిలో జింక్, మెగ్నీషియం, విటమిన్ డి ఉంటాయి. ఇవి జ్ఞాపక శక్తిని పెంపొందించడానికి సహాయపడతాయి.

వాల్ నట్స్:

వాల్ నట్స్ బ్రెయిన్ కి సూపర్ ఫుడ్ అని చెప్పవచ్చు. దీనిలో ఆల్ఫా లినోలిక్ యాసిడ్, పాలీ ఫినాల్స్ కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి కూడా ఒత్తిడిని, ఇన్ఫ్లమేషన్ ని దూరం చేసి జ్ఞాపక శక్తిని పెంచడానికి సహాయపడతాయి.

Read more RELATED
Recommended to you

Latest news