బరువు తగ్గాలంటే వీటిని తీసుకోవాలి..!

-

చాలా మంది బరువు తగ్గడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నిజంగా బరువును మెయింటైన్ చేస్తే ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు. అయితే ఈ ఆహార పదార్థాలు తినడం వల్ల బరువు తగ్గవచ్చని నిపుణులు అంటున్నారు. మీరు కూడా బరువు తగ్గాలనుకుంటే వీటిని తీసుకోండి. తద్వారా బరువు తగ్గొచ్చు.

The 7 Most Effective Weight Loss Tips, According to an Expert

గుడ్లు

గుడ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి బరువు తగ్గడానికి కూడా బాగా ఉపయోగపడతాయి కొలెస్ట్రాల్ లెవెల్స్ ని గుడ్లు తగ్గిస్తాయి. గుడ్లలో ప్రోటీన్స్, ఫ్యాట్స్ సమృద్ధిగా ఉంటాయి. గుడ్లని డైట్ లో తీసుకుంటే ఎక్కువ సేపు ఆకలి వేయకుండా చూసుకుంటాయి.

కూరగాయలు

కాలీఫ్లవర్, క్యాబేజీ బ్రోకలీ వంటి కూరగాయలలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. మిగిలిన కూరగాయల కంటే వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువ సేపు ఆకలి వేయకుండా చూసుకుంటుంది. దీనితో కూడా మీరు బరువు తగ్గొచ్చు. కనుక రెగ్యులర్ గా మీ డైట్ లో వీటిని తీసుకుంటూ వుండండి.

ఆకుకూరలు

పాలకూర మొదలైన ఆకుకూరలు తీసుకోవడం వల్ల బరువు తగ్గొచ్చు. వీటిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ మరియు ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది.

సాల్మన్

ఇది కూడా ఎక్కువ సేపు ఆకలి వేయకుండా చూసుకుంటుంది. ఇందులో ప్రోటీన్స్, ఫ్యాట్స్ సమృద్ధిగా ఉంటాయి. ఐయోడిన్ కూడా ఇందులో ఎక్కువగా ఉంటుంది.

ఉడికించిన బంగాళ దుంపలు

బరువు తగ్గడానికి బంగాళదుంపలు కూడా బాగా ఉపయోగపడతాయి. వీటిలో పోషక పదార్ధాలు సమృద్ధిగా ఉంటాయి. ఎక్కువసేపు ఇది కడుపు నిండుగా ఉండేట్లు చూసుకుంటుంది. అలానే ఇవి బ్లడ్ ప్రెజర్ ను కూడా రెగ్యులేట్ చేస్తాయి. అలానే సోయా బీన్స్ కూడా బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి. కనుక ఈ ఆహార పదార్థాలను మీ డైట్ లో తీసుకుంటే బరువు తగ్గచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news