గోర్లు కత్తిరించేటప్పుడు నొప్పి రాకపోవడానికి అసలు కారణం ఇదే!

-

గోర్లు కట్టిరించేటప్పుడు నొప్పి ఎందుకు రాదు ఈ ప్రశ్న చాలా మందికి వచ్చి ఉంటుంది. గోర్లు కత్తిరించేటప్పుడు నొప్పి రాకపోవడానికి ముఖ్యమైన కారణం వాటి నిర్మాణమే. గోర్లు వెంట్రుకల మాదిరిగానే కెరాటిన్ అనే ఒక రకమైన గట్టి ప్రోటీన్ తో తయారవుతాయి. ఈ కణంలో జీవం ఉండదు కాబట్టి వీటిని కత్తిరించేటప్పుడు మనకి నొప్పి తెలియదు. అసలు గోరు నిర్మాణం, వాటి ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం..

గోర్లు కత్తిరించేటప్పుడు నొప్పి రాకపోవడానికి అవి ఉండే నిర్మాణమే కారణం. గోర్లలో ఉండే కెరాటిన్ అనే గట్టి ప్రోటీన్ తో అవి తయారవుతాయి. ఇది చనిపోయిన కణాల సమూహం లాంటివి. గోరు చుడటానికి నరాలు, రక్తనాళాలు లేని కణంలో ఉంటుంది. అందుకే దీనిని కత్తిరించేటప్పుడు నొప్పి రాదు. చర్మవ్యాధి నిపుణులు గోరు పైభాగం, చర్మం కింద ఉన్న నరాలతో సంబంధం లేని కారణంగా అవి నొప్పి రావని సూచించారు.

గోరు మూలం అంటే (నెయిల్ బెడ్) కింద చర్మం లో నరాలు రక్తనాళాలు ఉంటాయి. గోర్లు చాలా లోతుగా కత్తిరిస్తే నెయిల్ బెడ్ దెబ్బ తినడం వల్ల నొప్పి కలుగుతుంది. అందుకే గోర్లను సురక్షితంగా చిన్నగా కత్తిరించుకోవాలి. గోరు కత్తిరించేటప్పుడు కాస్త అశ్రద్ధగా ఉన్న కొంచెం లోపలికి కత్తిరించిన గోరు చాలా నొప్పి చేస్తుంది. గోరు నిర్మాణంలో మరో భాగం క్యూటికల్ చర్మాన్ని రక్షిస్తుంది. కానీ ఇది కూడా కత్తిరించేటప్పుడు జాగ్రత్తగా వహించాలి.లేకపోతే ఇన్ఫెక్షన్లు రావచ్చు.

The Real Reason You Don’t Feel Pain While Cutting Nails!
The Real Reason You Don’t Feel Pain While Cutting Nails!

కొంతమంది గోర్లను ఫ్యాషన్ కోసం పొడుగ్గా పెంచడం మొదలు పెడతారు. మొదట్లో చాలా బాగుంటుంది తర్వాత కొన్ని రోజులకి గోరులో బ్యాక్టీరియా చేరి, అవి మన శరీరంలోనికి వెళ్లి మన ఆరోగ్యానికి ఎంతో హాని కలిగిస్తాయి. ఇంకొంతమంది గోర్లకు నెయిల్ పాలిష్ వేస్తారు ఇది ఇప్పుడు ప్రతి ఒక్కరు సర్వసాధారణంగా చేస్తున్న పని, కానీ గోరు దెబ్బ తినడానికి ఈ నెయిల్ పాలిష్ ఎంతో దారితీస్తుంది.

గోర్లు శరీరంలో రక్షణ పొరగా పనిచేస్తాయి. వేళ్ళ చివరలను గాయాలనుంచి కాపాడడానికి గోర్లు ఎంతో సహాయపడతాయి. గోర్లను కత్తిరించడం వల్ల శుభ్రత, ఆరోగ్యం మెరుగుపడుతుంది. నిపుణుల సలహా ప్రకారం గోర్లను రెగ్యులర్ గా కత్తిరించుకోవాలి అని సూచిస్తున్నారు. గోర్లు త్వరగా సులభంగా కత్తిరించుకోవడానికి సులభమైన మార్గం స్నానం చేసి వచ్చిన వెంటనే కత్తిరించడం.

Read more RELATED
Recommended to you

Latest news