రుషికొండ భవనాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాట్ కామెంట్స్ చేసారు.విశాఖపట్నంలో ”సేనతో సేనాని” కార్యక్రమాలలో పాల్గొంటున్న ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఋషికొండ ప్యాలెస్ ను పరిశీలించారు. పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి పవన్ కళ్యాణ్ ఋషికొండలోని భవనాలను దగ్గర ఉండి పరిశీలించారు. ఈ సందర్బంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రుషికొండ భవనాలు దెబ్బతిన్నాయన్నారు.

పెచ్చులు ఊడిపోతున్నాయి, కొన్ని చోట్ల లీకేజ్ అవుతోందన్నారు. రూ.453 కోట్లతో మొత్తం 4 బ్లాక్ లు నిర్మించారని బాంబు పేల్చారు. గతంలో రిసార్ట్స్ గా ఉన్నప్పుడు ఏడాదికి రూ.7 కోట్ల ఆదాయం వచ్చేది… కానీ ప్రస్తుతం కరెంటు బిల్లులకే ఏడాదికి రూ.15 లక్షలు అవుతోందని చెప్పారు పవన్. రుషికొండ భవనాలను ఏ విధంగా ఆదాయ మార్గంగా ఉపయోగించాలనే దానిపై ప్రధానంగా చర్చించామన్నారు పవన్ కళ్యాణ్.