ఈ సీజన్ లో ఉసిరిని తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఎన్నో….!

Join Our Community
follow manalokam on social media

ఉసిరి వల్ల అనేక లాభాలు ఉన్నాయి. ఈ సీజన్ లో మాత్రం వీటిని తప్పక తీసుకోండి. ఇది అనేక అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టేస్తుంది. అయితే మరి వీటిని చలి కాలం లో తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి…? ఈ విషయం లోకి వస్తే… ఉసిరిలో విటమిన్‌ సి మనకు సమృద్ధిగా దొరుకుతుంది. నారింజ, నిమ్మ, దానిమ్మ కాయల కన్నా ఎక్కువ విటమిన్‌ సి ఇందులో ఉంటుంది. మీరు ఈ సీజన్‌లో దొరికే ఉసిరిని తరచూ తీసుకుంటే విటమిన్‌ సి లోపం రాదు.

అలానే ఉసిరిని తీసుకోవడం వల్ల శరీర రోగ నిరోధక శక్తిని మెరుగు పడుతుంది. దీని మూలంగా చలి కాలం లో వేగంగా వచ్చే దగ్గు, జలుబు, ఫ్లూ జ్వరం వగైరా మన చెంతకు చేరలేవు. చలికాలంలో వచ్చే చర్మ సమస్యలు తగ్గాలంటే ఉసిరికాయ రసాన్ని రోజూ వాడాలి. అలానే జుట్టు రాలి పోవడం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. చలి కాలం లో మాములు గానే జీర్ణ ప్రక్రియ మందగిస్తుంది.ఈ సమయంలో రోజూ ఉసిరికాయల రసాన్ని తాగితే తిన్నదంతా సరిగ్గా జీర్ణం అవుతుంది.

డయాబెటిస్‌ ఉన్న వారు ఉసిరి కాయలను తినడం వలన కావల్సినంత క్రోమియం వారికి లభిస్తుంది. దీని మూలం గానే ఇన్సులిన్‌ చురుగ్గా పని చేస్తుంది. అలాగే షుగర్‌ లెవల్స్‌ తగ్గుతాయి. కాబట్టి డయాబెటిస్‌ ఉన్న వాళ్ళు కూడా దీనిని ఈ సీజన్ లో తీసుకోవడం మంచిది. మరి ఇంకా ఈ సీజన్ లో దొరికే ఉసిరిని తీసుకోండి అనేక సమస్యలకి ఇప్పుడే చెక్ పెట్టేయండి.

TOP STORIES

సులభ్ కాంప్లెక్స్ లో మటన్ షాపు నిర్వహణ..!

మటన్, చికెన్ షాపులకు డిమాండ్ ఎక్కువనే చెప్పుకోవచ్చు. చుక్కా, ముక్కా లేనిదే కొందరి ముద్ద దిగదనే భావనలో బతికేస్తుంటారు. ఎన్ని బర్డ్ ఫ్లూలు వచ్చినా ఇంట్లో...