స్త్రీలకు ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది సరైన మోతాదులో ఉత్పత్తికాక అనేకరకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీని కోసం రకరకాల మందులు ఉపయోగించి. ఈస్ట్రోజన్ లెవల్స్ ను పెంచుకుని…సమస్యను తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎంతకాలం ఇలా చేస్తారు. ఇలా ధీర్ఘకాలంగా మందులను ఉపయోగించటం మంచిదికాదు కాబట్టి నాచురల్ గా ఈస్ట్రోజన్ హార్మోన్ ను ఉత్పత్తిచేసే డైట్స్ ఏమైనా ఉంటాయా అనేది ఈరోజు తెలుసుకుందాం.
స్త్రీలకు ఈస్ట్రోజన్ హార్మోన్ ఎంత అవసరం:
స్త్రీలకు ఈస్ట్రోజన్ హార్మోన్ కరెక్టుగా ఉంటానే..నెల నెల వచ్చే రుతుక్రమం కరెక్టుగా వస్తుంది.
ఈస్ట్రోజన్ హార్మోన్ ఉంటేనే..ఎగ్స్ కరెక్టుగా రిలీజ్ అవుతాయి, ఫోలికల్స్ కూడా హెల్తీగా ఉంటాయి.
ఈ హార్మోన్ కరెక్టుగా ఉంటేనే గర్భం వచ్చే అవకాశం ఉంటుంది.
ఎండోమెంటిరియం పొర థిక్ నెస్ కూడా కరెక్టుగా మెయింటేన్ అవుతుంది.
ఈస్ట్రోజన్ హార్మోన్ కరెక్టుగా ఉన్నప్పుడే బ్లీడింగ్ సైకిల్ 4 డైస్ కరెక్టుగా వస్తుంది. ఆ తర్వతా కరెక్టుగా స్టాప్ అవుతుంది.
ఈస్టోజన్ బాగుంటేనే..ప్రిమెన్స్ ట్రుయల్ సిండ్రోమ్స్ కానీ..మెనోపాజ్ లో వచ్చే ఇబ్బందులు కానీ రాకుండా ఉంటాయి.
స్ట్రీలల్లో గర్బంధారణ జరిగినప్పుడు..కొన్నిసార్లు అబార్షన్ చేయాల్సి వస్తుంది..ఈ హార్మోన్ కరెక్టుగా ఉంటే..అలాంటి పరిస్థితి రాదు.
ఈరోజుల్లో మనం తినే ఆహారాలు మంచివి కాక..అంటే.పాలిష్ పట్టినవి, బాగా హై ఘుగర్ ఫుడ్, హై ఫ్యాట్ ఫుడ్ , టేస్టీ ఉండే ఫుడ్ ని ఎక్కువగా తినటం వల్ల హార్మోన్ డిస్టబెన్స్ ఎక్కువ వచ్చేశాయి. నాచురల్ గా ఈస్ట్రోజన్ హార్మోన్ స్త్రీలకు ఉత్పత్తి అవ్వాలంటే..నాచురల్ గా ఈస్ట్రోజన్ హార్మోన్ ఉత్పత్తి పెంచే డైట్ తీసుకోవాలి. ఈస్ట్రోజన్ హార్మోన్ పెంచే ఏకైక హార్మోన్ ఒకటి ఉంది అని సైంటిఫిక్ గా నిరూపించబడింది. అది ఏంటంటే..సోయా చిక్కుడు గింజలు.
సోయాలో ఈస్ట్రోజన్ ఉంటుంది..ఫైటో ఈస్ట్రోజన్ ఫామ్ లో ఉంటుందగట. మొక్కల్లో ఉండే ఈస్ట్రోజన్ ను ఫైటో ఈస్ట్రోజన్ అంటారు. దాన్ని మనం తిన్న తర్వాత హ్యూమన్ ఈస్ట్రోజన్ గా కన్వర్ట్ చేసుకుంటుంది. ఇది తింటే..ఇమిడియట్ గా స్త్రీలల్లో ఈస్ట్రోజన్ ఫామ్ అవుతుంది.
100గ్రాముల సోయాచిక్కుడు తీసుకుంటే..ఇందలో 250-560 మిల్లీగ్రాముల వరకూ ఫైటో ఈస్ట్రోజన్ లభిస్తుంది అని సైంటిఫిక్ గా తేలింది. కొందరికి సోయా చిక్కుడు తింటే..హార్మోన్ డిస్టబెన్స్ వస్తుంది, ధైరయిడ్ వస్తుంది అని అపోహ ఉంది..ఎప్పుడు సోయా చిక్కుడు హాని కలిగిస్తుందంటే..ఈ గింజలను మనం పచ్చిగా తినేసినప్పుడు అందులో ఉంటే..గ్వాయ్ ట్రిన్స్ అనేవి మనం తీసుకున్న ఆహారం నుండి అయోడిన్ ధైరాయిడ్ కు పట్టకుండా ధైరాయిడ్ సమస్యలు చేయడానికి, హార్మోన్ డిస్టబెన్స్ వచ్చేట్లు చేయడానికి ఈ పచ్చి సోయాచిక్కుడు గింజలు కారణం అవుతాయి. కాబట్టి.. మనం ఈ సోయాగింజలను వండితిన్నప్పుడు ఇందులో ఉండే గ్యాయ్ ట్రిన్స్ అనేవి నశిస్తాయి కాబట్టి శరీరానికి హానికలిగించు అని సైంటిఫిక్ గా రుజువైంది.
సోయాగింజలు తినే పద్ధతి:
ఈ గింజలను ఎప్పుడు తినాలన్నా..12 గంటలు నానపెట్టి..మినపప్పు కడినట్లు..పొట్టు తీసేసి..కుక్కర్లో ఉడకపెట్టండి. ఈ ఉడికినవాటిని..ఏదైనా కూరల్లో వాడొచ్చు. బఠానీలు నానపెట్టి వేసే కూరలు లాంటివి ఉంటాయికదా అలాంటి వాటిల్లో వేయొచ్చు, ఫ్రైలో వేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు, ఆకుకూరలల్లో వేయండి..ఇలా అన్నింటిలో రెగ్యులర్ గా వేస్తుంటే..టేస్ట్ బాగుంటుంది, ఈస్ట్రోజన్ కూడా సింపుల్ గా ఫామ్ అవుతుంది. సోయచిక్కుడు గింజులు నానపెట్టిన వాటిని గ్రైండ్ చేసి ఫిల్టర్ చేస్తే..సోయా మిల్క్ వస్తుంది. ఈ పాలును కూడా కూరల్లో కూడా వాడొచ్చు. ఈ పాలను విరగకొట్టి పన్నీరు చేసుకుని తిన్నా మంచి లాభాలు ఉంటాయి. స్త్రీలకు కావాల్సిన హార్మోన్ ను ఉత్పత్తికి కూడా ఇది మంచిది. ఇలా సోయా ప్రొడెక్ట్ ను వాడుకుంటే..త్వరగా ఈస్ట్రోజన్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది
ఇంకొందరికి పీరయడ్స్ రాక, ఓవరీస్ లో నీటిబుడగలు సమస్య కామన్ గా ఉంది. బుడగలకోసం ఆపరేషన్ చేయించుకున్నా మళ్లా తిరిగివస్తున్నాయి. 100 మందిలో 70 మంది లావుగా ఉంటారు. ఈ హార్మోన్ డిస్టబెన్స్ రావడానికి లావవడం ఒక కారణం. మానసిక ఒత్తిడి వల్ల హార్మోన్ డిస్టబ్ అవుతాయి. బరువు పెరిగినా హార్మోన్ డిస్టబ్ అవుతాయి. మంచి ఆహారం తినకపోయినా హార్మోన్ డిస్టబ్ అవుతాయి. వీటివల్ల పెళ్లేతే పిల్లలు పుట్టరు, సరిగ్గా పీరియడ్స్ రావు, ఇంకొందరికి బ్లీడింగ్ ఆగదు. ఇంకొందరికి..ఆవాంఛిత రోమాలు వస్తాయి. ఇలాంటి ఇబ్బందులను కూడా సింపుల్ గా పరిష్కరించుకోవచ్చు. ఇప్పుడు చెప్పుకోబోయే పద్దతులు పాటిస్తే..రెండు నెలల్లో ఈ సమస్యలు అన్నీ పరిష్కారం అవుతాయి.
70% రాఫుడ్ ఫ్లాన్
ఉదయం 8గంటలకు ఒక గ్లాస్ వెజిటబుల్ జ్యూస్ తాగండి. క్యారెట్, బీట్ రూట్, పొట్లకాయ, సొరకాయ ఇలాంటి వెజిటబుల్ జ్యూస్ తాగండి. ఈ జ్యూస్ తాగితే బ్లడ్ ఫార్మింగ్ అవుతుంది. పండ్లరసంతో సమానమైన లాభాలు వెజిటబుల్ జ్యూస్ లో ఉన్నాయి. విటమిన్ A,C పుష్కలంగా ఉంటాయి.
జ్యూస్ తాగిన గంటకు బాగా ఆకలివేస్తుంది.మొలకెత్తిన పెసలు, అలసందలు, శనగలు, కర్జూరాలు తినండి. ఇడ్లీ, దోశలు లాంటి బ్రేక్ ఫాస్ట్ మానేయండి.
ఏ ఫుడ్ అయినా లంచ్ లో ఎంజాయ్ చేయండి. వీలైనంత వరకూ.. రైస్ మానేసి..పుల్కాలు, ఉప్పు నూనెలు తగ్గించండి. ఎక్కువ కూరలు తిని..కప్పు పెరుగు వాడుకోండి. వెయిట్ తగ్గడానికి ఇది మంచి పరిష్కారం
సాయంత్రం ఏదైనా పండ్లరసం తాగండి. లేదా కొబ్బరినీళ్లు, చెరుకురసం తాగండి. 6.30 కు జామకాయలు, ఆపిల్ లాంటివి తినండి.
ఎర్లీ డిన్నర్ తింటేనే బరువు తగ్గుతారు. నాచురల్ ఫుడ్ తినేసేయండి. దీనివల్ల వెయిట్ లాస్ అవుతుంది, బుడగలు తగ్గుతాయి.
ఆదివారం ఒక్కరోజు మీకు నచ్చిన ఫుడ్ తింటూ..మిగతారోజుల్లో పైన చెప్పినట డైట్ ఫాలో అయితే..రెండు నెలల్లో సమస్యలు అన్నీతగ్గిపోతాయి. కొంతమందికి మూడు నెలల్లో పోతాయి. గరిష్టంగా నాలుగు నెలల్లో ఈ సమస్యలు తగ్గిపోతాయి. ఒక మెడిసన్ వేసుకోకుండా ఈ డైట్ ఫాలో అవడం వల్ల సమస్యలను తగ్గించుకోవచ్చని..ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎప్పుడైతే ఇలాంటి సమస్యలకు మందులు వాడతారో…అవాంఛిత రోమాలు వచ్చేస్తాయి. అందుకే పీసీఓడీ సమస్య ఉన్నవారికి ముఖంపై వెంట్రుకలు వస్తాయి. నాచురల్ డైట్ తో వీటికి చెక్ పెట్టేయండి.
-Triveni Buskarowthu