తెలంగాణ‌లో కొత్త‌గా 767 క‌రోనా కేసులు.. ఇద్ద‌రు మృతి

-

తెలంగాణ‌లో కరోనా కేసులు సంఖ్య రోజు రోజుకు భారీగా త‌గ్గుతుంది. బుధ‌వారం తెలంగాణ‌లో 865 కరోనా కేసులు రాగ‌.. నేడు రాష్ట్రంలో 767 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో 7,81,603 క‌రోనా పాజిటివ్ కేసులు నిర్ధార‌ణ అయ్యాయి. కాగ గ‌డిచిన 24 గంట‌ల‌లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 58,749 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్షలు నిర్వ‌హించారు. కాగ రాష్ట్రంలో నేడు క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఇద్ద‌రు మృతి చెందారు.

దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు 4,105 మంది క‌రోనా వైర‌స్ మూలంగా మ‌ర‌ణించారు. కాగ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ‌డిచిన 24 గంట‌ల‌లో 2,861 మంది క‌రోనా బాధితులు కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ప్ర‌స్తుతం 17,754 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగ థ‌ర్డ్ వేవ్ వ‌చ్చిన త‌ర్వాత తెలంగాణ రాష్ట్రంలో గ‌త రెండు రోజుల నుంచి వెయికి తక్కువ సంఖ్య‌లో క‌రోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. అలాగే ప్ర‌తి రోజు కూడా కేసుల సంఖ్య భారీగానే త‌గ్గుతున్నాయి. ఈ రోజు కూడా నిన్న‌టితో పోలిస్తే.. దాదాపు 100 కరోనా కేసులు త‌గ్గాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news