రక్త హీనత అనగా రక్త కణాలు తగ్గిపోవడం అని అర్థం.మాములుగా మన దేహంలో బ్లడ్ లెవెల్స్ 8 నుంచి 12 పాయింట్స్ రక్తం ఉండాలి. ఇంతకంటే తక్కువగా ఉంటే రక్తహీనత అంటారు. మన దేహంలో తగినంత ఐరన్, ఫోలిక్ యాసిడ్,విటమిన్స్ లేకపోవడం వల్ల ఈ వస్తుంది. ఐరన్ మరియు విటమిన్ ఎ,బి బి 12,బి 3, బి 6, సి, డి ఇ లతో పాటు రాగి, జింక్ గల విటమిన్స్ రక్తహీనతకు ప్రధాన కారణాలు. మన శరీరంలోని పెద్ద ఎముకల్లో హిమోగ్లోబిన్ తయారవుతుంది. ఈ హీమోగ్లోబిన్ తక్కువ గా తయారవడం వల్ల రక్తహీనత ఏర్పడుతుంది. మనం తీసుకునే ఆహారం లో సరైన పోషక విలువలు లేకపోవడం వలన మనకి ఈ రక్తహీనత సంభవిస్తుంది.ముఖ్యంగా ఆడవారిలో ఎనీమియా లక్షణాలు ఎక్కువగా ఉంటాయి.
ఎనీమియా లక్షణాలు :
మనం చిన్న చిన్న పనులకే త్వరగా అలసిపోవడం, చిరాకుపడడం మరియు మానసికంగా అలసిపోవడం వంటి లక్షణాలు గనుక మనకి ఉన్నట్లు అనిపిస్తే ఒకసారి రక్త పరీక్ష చేయించుకోవలను.
మనలో రక్తహీనత ఉంటే కాళ్ళు, చేతులు తిమ్మిర్లు ఎక్కడం, కళ్ళు తిరగడం, ఆయాసం, తరచుగా తలనొప్పి రావడం వంటివి ప్రధాన లక్షణాలు.
రక్త హీనత ఉన్న వారికి శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. చాతిలో నొప్పి కూడా రావొచ్చు.
రక్తహీనత ఉన్న వారు గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతుంటారు .
కడుపులో కొన్ని రకాల నులిపురుగులు రక్తాన్ని పీల్చేస్తాయి. దీనివల్ల కూడా రక్త హీనత ఏర్పడుతుంది.
టీ, కాఫీలు మనం తీసుకున్న ఆహారాన్ని జీర్ణం కానివ్వవు.ఇలాంటి పానీయలు తీసుకోవడం వలన రక్తహీనత లోపం ఏర్పడుతుంది.
మలేరియా, టైఫాయిడ్ వంటి జబ్బులు వచ్చినప్పుడు కూడా మన శరీరంలో రక్తహీనత లోపం వస్తుంది.
చర్మం పాలిపోవటం, నాలుక పాలిపోయి ఉండడం, కనురెప్పలు కింద భాగం తెల్లగా ఉండటం వంటి లక్షణాలు కూడా రక్తహీనతకి దారితీస్తాయి.