షుగర్ తో బాధపడుతున్నారా..? అయితే ఈ పువ్వు మీకు వరం..!

-

చాలామంది ఈ రోజుల్లో అనేక రకాల అనారోగ్య సమస్యలు కారణంగా ఇబ్బంది పడుతున్నారు. మీరు కూడా అలాగే ఇబ్బంది పడుతున్నారా..? షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజుల్లో చాలా మంది షుగర్ వలన ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. మీకు కూడా షుగర్ ఉన్నట్లయితే శంఖు పూలను ఉపయోగించడం మంచిది. శంఖు పూలతో టీ చేసుకుని తీసుకుంటే బావుంటుంది. లేదంటే ఈ పూలు నీటిని తీసుకుంటే కూడా షుగర్ అదుపులో ఉంటుంది. ఈ పూల గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. చాలా మంది పూజలో ఈ పూలను వాడుతూ ఉంటారు.

ఔషధ గుణాలు ఇందులో సమృద్ధిగా ఉంటాయి. కొద్దిగా నీళ్లు తీసుకుని అందులో ఈ శంఖు పూలని వేసి మరిగించి తీసుకోవాలి. దీనిని తీసుకోవడం వలన కంటికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. కంటికి రక్తప్రసరణ బాగా జరిగి కంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే తెల్లని జుట్టుని నల్లగా మార్చేందుకు కూడా పూలు బాగా హెల్ప్ చేస్తాయి. చర్మాన్ని అందంగా, కాంతివంతంగా మారుస్తాయి.

చర్మంపై ఉండే ముడతల్ని కూడా ఇవి పోగొడతాయి. ఈ పూలు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచి జ్ఞాపకశక్తిని పెంచుతాయి. యాంగ్జైటీ, ఒత్తిడి సమస్యలను కూడా సులువుగా పోగొడతాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఇందులో సమృద్ధిగా ఉంటాయి. షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వడానికి కూడా ఈ పూలు బాగా హెల్ప్ చేస్తాయి. యాంటీ డయాబెటిక్ గుణాలు ఇందులో ఉంటాయి. ఇన్సులిన్ సామర్థ్యాన్ని మెరుగుపరిచి డయాబెటిస్ వాళ్ళకి ఎంతో ప్రయోజనాన్ని అందిస్తాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version