గ్రాడ్యుయేట్ ఎమెల్సీ ఎన్నికపై కాంగ్రెస్ కసరత్తు.. జీవన్ రెడ్డికి మరో చాన్స్..?

-

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై హస్తం పార్టీ ఫోకస్ పెట్టింది.. అధికారంలో ఉండటంతో..ఈ ఎన్నికలో గెలుపును ప్రతిష్టాత్మంగా తీసుకుంది.. అభ్యర్ది ఎంపిక, అనుసరించాల్సిన వ్యూహాలు, తీసుకోవాల్సిన నిర్ణయాలపై పీసీసీ ప్రత్యేక సమావేశం నిర్వహించింది.. ఇందులో పలు కీలక తీర్మానాలు కూడా చేశారు.. ఇంతకీ జీవన్ రెడ్డికి మరో ఛాన్స్ ఉంటుందా..? అధిష్టానం మదిలో ఎవరున్నారు..?

నిజామాబాద్ -ఆదిలాబాద్- మెదక్ – కరీంనగర్ పట్టభద్రుల కోటా నుంచి జీవన్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు.. మరో నాలుగు నెలల్లో ఆయన పదవి కాలం ముగియబోతుంది.. దీంతో ఆ స్థానాన్ని మళ్లీ చేజిక్కించుకునేందుకు హస్తం పార్టీ పావులు కదుపుతోంది.. సీనియర్ నేతలు, మంత్రులతో ఇన్చార్జి దీపాదాస్ మున్షీ ప్రత్యేక సమావేశమయ్యారు.. అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.. అభ్యర్ది ఎంపికపై కమిటీ వెయ్యాలని తీర్మానించారు.. ఒక్కో జిల్లాకు ఒక్కో మంత్రిని నియమించి.. బాధ్యతలన్నీ వారికి అప్పగించేలా ప్లాన్ చేస్తున్నారట..

తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో అభ్యర్ది ఎంపికపై నేతలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.. తమ నిర్ణయాన్ని అధిష్టానానికి పంపి.. జీవన్ రెడ్డినే మరోసారి బరిలోకి దింపేలా రాష్ట నేతలు ప్లాన్ చేస్తున్నారట.. అయితే దీనిపై జీవన్ రెడ్డి సముఖతతో లేరనే టాక్ వినిపిస్తోంది.. పట్టభద్రుల ఎమ్మెల్సీ నుంచి కాకుండా.. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ కావాలని జీవన్ రెడ్డి అడుగుతున్నారని.. గాంధీభవన్ నేతలు చర్చించుకుంటున్నారు..

జీవన్ రెడ్డిని బరిలోకి దింపి.. బిజేపీ దూకుడుకు కళ్లెం వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.. అందులో భాగంగా ఓటర్ల నమోదు ప్రక్రియను కూడా వేగవంతం చెయ్యాలని మంత్రులకు పార్టీ నుంచి ఆదేశాలందాయట.. ఈ క్రమంలో జీవన్ రెడ్డి మరోసారి పోటీ చేస్తారా..? లేక అధిష్టానం మరొకరికి అవకాశం ఇస్తుందా.. చూడాలి..

Read more RELATED
Recommended to you

Exit mobile version