ఎక్కువ ఆలోవెరాని తీసుకుంటే ఈ సమస్యలు వస్తాయి..!

అలోవెరా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఆయుర్వేద గుణాలు ఉండే అలోవేరా ని తీసుకోవడానికి ఎన్నో సమస్యలు తగ్గించుకోవడానికి మనం ఉపయోగించుకోవచ్చు. అలోవెరా లో విటమిన్స్ మినరల్స్, ఫ్లేవనాయిడ్స్, ఫైటో న్యూట్రియంట్స్ మొదలైన పోషక పదార్థాలు ఉంటాయి.

 

రోగనిరోధక శక్తిని పెంచడానికి, బరువు తగ్గించడానికి, జీర్ణ సమస్యలను పోగొట్టడానికి, కార్డియో వాస్క్యులర్ సమస్యలు పోగొట్టడానికి ఇలా ఎన్నో విధాలుగా అలోవెరా మనకి ఉపయోగపడుతుంది. అయితే ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. మరి ఆలస్యం ఎందుకు దీని కోసం ఇప్పుడే పూర్తిగా చూద్దాం.

లాటెక్స్ అలెర్జీ:

కొంత మందికి లేటెక్స్ అంటే పడదు. అటువంటి వాళ్ళు అలోవెరా కి దూరంగా ఉండాలి. లేదు అంటే చర్మంపై రాషెస్, చర్మం ఎరుపెక్కడం, తుమ్ములు రావడం, దురదలు కలగడం, గొంతు సమస్యలు ఇలా మొదలైన సమస్యలు వస్తాయి. కాబట్టి ఇలా లాటెక్స్ అలెర్జీ ఉంటే అలోవెరా కి దూరంగా ఉండండి.

ఎలర్జీ సమస్యలు:

అలోవెరాని ఎక్కువగా వాడడం వల్ల ఎలర్జీ సమస్యలు కూడా వస్తాయి. చర్మం మండడం, బర్నింగ్ సెన్సేషన్ లాంటివి వస్తాయి. ఒకవేళ కనుక అలోవెరా వాడినప్పుడు మీకు అలాంటి ఇబ్బందులు వస్తే అలోవెరా కి దూరంగా ఉండటం మంచిది.

డీహైడ్రేషన్ సమస్య వస్తుంది:

లాటెక్స్ ఇందులో ఉంటుంది కాబట్టి డీహైడ్రేషన్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువగా మీరు అలోవెరాని వాడుతున్నట్లయితే డీహైడ్రేషన్ సమస్య వస్తుంది అని గుర్తుపెట్టుకోండి.