నొప్పులు రాకుండా ఉండాలంటే డైట్ లో ఇవి ఉండాలి…!

-

ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది మోకాళ్ల నొప్పులతో బాధ పడుతున్నారు. అయితే మోకాళ్లలో సమస్యలు రాకుండా ఉండాలంటే మనం తీసుకునే ఆహారం కూడా చాలా ముఖ్యమని వైద్య నిపుణులు అంటున్నారు. మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉండాలంటే మనం తీసుకునే ఆహారం కూడా బాగుండాలి.

 

పోషక పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల చాలా సమస్యలకు మనం చెక్ పెట్టొచ్చు. ఇలా మార్పులు చేస్తే మోకాళ్ళ నొప్పులు నుంచి సులువుగా బయటపడొచ్చు. జాయింట్ హెల్త్ బాగుండాలంటే ఈ ఆహారపదార్థాలు తప్పక తీసుకోవాలి అవి ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం.

క్యాల్షియం:

క్యాల్షియం మంచి ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఎముకల్ని దృఢంగా ఉంచుతుంది. శరీరంలో అవసరమైనంత క్యాల్షియం లేకపోతే ఎముకలు బలహీనంగా అయిపోతాయి. కాబట్టి క్యాల్షియం సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోండి. క్యాల్షియం మనకి పాలు, పాల పదార్థాలలో లభిస్తుంది. చీజ్ లేదా యోగర్ట్ మరియు ఆకుకూరలు, అంజీర్ వంటివాటిలో క్యాల్షియం ఉంటుంది.

విటమిన్ డి:

విటమిన్ డీ కూడా ఆరోగ్యానికి చాలా అవసరం. విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను కూడా డైట్ లో తీసుకోండి. గుడ్లు, ఎండవేడి, మష్రూమ్స్ , ఫ్యాటి ఫిష్ వంటి వాటిలో విటమిన్ డి దొరుకుతుంది. కాబట్టి విటమిన్ డి ని కూడా మీ డైట్ లో తీసుకోండి.

మంచి కొవ్వు పదార్థాలు:

మంచి కొవ్వు పదార్థాలను కూడా డైట్ లో తీసుకోవడం చాలా ఈ ముఖ్యం. నట్స్, గింజలు, కొబ్బరి, అవకాడో వంటివి మీ డైట్ లో తీసుకోండి. ఇలా మీరు మీ డైట్ లో వీటిని తీసుకున్నారంటే ఖచ్చితంగా ఈ సమస్య నుండి బయట పడవచ్చు. కాబట్టి ఈ మార్పులు చేసి సమస్యలు లేకుండా ఉండండి. ఆరోగ్యంగా వుండండి.

Read more RELATED
Recommended to you

Latest news