ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్

ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ ను రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్స్ ప్రకటించింది. యూఎస్ కు చెందిన ముగ్గురు ఆర్థిక వేత్తలకు కలిపి 2021 నోబెల్ బహుమతిని ప్రకటించారు. డేవిడ్ కార్డ్, డి. ఆంగ్రిస్, గైడో ఇంబెన్స్ కు ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. ఆర్థిక శాస్త్రంలో ముగ్గురు చేసిన సేవలకు గానూ ఉమ్మడిగా నొబెల్ ను ప్రకటించారు. డేవిడ్ కార్డ్ యూనివర్సీటీ ఆఫ్ కాలిఫోర్నియాకు, ఆంగ్రిస్ట్ మసూచాసెట్స్ యూనివర్సీటీకి, ఇంబెన్స్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి చెందినవారు.

 ప్రతీ ఏటా ఆర్థిక శాస్త్రంలో విశేష సేవలు అందించిన ఆర్థికవేత్తలకు రాయల్ స్వీడిష్ అకాడమీ నోబెల్ అవార్డును ప్రకటిస్తుంది. ఇప్పటికే వైద్యం, ఫిజిక్స్ , కెమిస్ట్రీ, సాహిత్యం, శాంతి విభాగాల్లో విశేష సేవలను అందించిన  పలువురు ప్రముఖులకు నోబెల్ బహుమతులను ప్రకటించారు. తాజాగా ఎకనామిక్స్ నోబెల్ ప్రకటించారు.