డైపర్ వేసే ముందు ఈ టిప్స్ పాటిస్తే పిల్లలకి ర్యాషెస్ ఉండవు ..!

-

చిన్న పిల్లలు రోజంతా డైపర్ వేసుకోవడంతో ఒక్కోసారి ర్యాషెస్ ఏర్పడుతాయి. దాంతో వాళ్లు చాలా ఇబ్బంది పడతారు. కానీ కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల డైపర్ ర్యాషెస్ రావు. డైపర్ వేసే ముందు ఒక బట్టను వేడి నీటిలో ముంచి ఒళ్ళు తుడవాలి. తర్వాత పొడి బట్ట తో తుడిచి, పౌడర్ రాసి అప్పుడు డైపర్ వేయాలి. ఒకసారి డైపర్ వల్ల ర్యాషెస్ వస్తే అవి తగ్గే వరకు డైపర్ వేయకూడదు. ఇలా చేయడం వల్ల తొందరగా ర్యాషెస్ తగ్గిపోతాయి.

డైపర్ వేసేముందు పౌడర్ రాయినట్లు అయితే, ఒక బట్ట తో తడిని తుడిచి వేసి బేబి క్రీం రాయడం వల్ల ర్యాషెస్ ఏర్పడవు. పౌడర్ కి బదులుగా బేబి క్రీం రాయవచ్చు. ర్యాషెస్ వచ్చిన చోట ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనె తీసుకొని నెమ్మదిగా రాయండి. ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ర్యాషెస్ తగ్గిపోతాయి.

మీరు నూనెకు బదులుగా అలోవెరా జెల్ తో కూడా మసాజ్ చేయవచ్చు. ఇలా చేయడం వల్ల పిల్లలకు ఇబ్బంది కూడా ఉండదు. డైపర్‌లను తరచుగా మార్చండి. తడి లేదా మురికి డైపర్‌లను వెంటనే తొలగించండి. ఇలాంటి జాగ్రత్తలు పాటించినా సరే ర్యాషెస్ తగ్గలేదు అంటే డాక్టర్ని సంప్రదించడం ఎంతో అవసరం.

Read more RELATED
Recommended to you

Latest news