కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యా న్ సతీమణి శ్రీమతి అన్నా కొణిదల గారు దర్శించుకున్నారు. సోమవారం వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో శ్రీమతి అన్నా కొణిదల గారికి వేద పండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ఇది ఇలా ఉండగా, తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించారు పవన్ కళ్యాణ్ భార్య అన్నా లేజ్‌నేవా. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్.. ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. సింగపూర్ లోని ప్రముఖ స్కూల్లో అగ్నిప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో.. చిక్కుకున్న పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్…. తీవ్ర గాయాల పాలయ్యాడు. అగ్ని ప్రమాదం కావడంతో పొగ మొత్తం తన ఊపిరితిత్తుల్లోకి వెళ్ళింది.