పొట్ట చుట్టు ఉన్న కొవ్వును కరిగించాలా..ఈ కూరగాయలను తినండి చాలు..!

-

కొంతమంది చూడ్డానికి సన్నగానే ఉంటారు.. కానీ పొట్ట ఎక్కువగా ఉంటుంది.. పొట్టు చుట్టు కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది. మరి అలాంటి వాళ్లు ఏం చేయాలి.. వ్యాయామం చేయడానికి అసలే సన్నగా ఉంటారు.. ఇంకా వీళ్లు వ్యాయామం చేస్తే ఇంకా అలిసిపోతారు. ఉదరం చుట్టూ ఉన్న కొవ్వు చాలా హానికరం. ఇది అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. పొట్ట దగ్గ‌రి కొవ్వు గుండె జబ్బులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది రక్తపోటును కూడా ప్రభావితం చేస్తుంది. పొట్ట‌ చుట్టూ పేరుకుపోయే కొవ్వు రక్తంలో అధిక చక్కెర స్థాయిల‌ను పెంచుతుంది. దీనివ‌ల్ల‌ జీర్ణక్రియ సరిగా ఉండదు. హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది. పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును క‌రిగించుకోవడానికి కూర‌గాయ‌లు స‌హాయ ప‌డ‌తాయి. వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు సుల‌భంగా క‌రుగుతుంది.

పాల‌కూర‌

పాల‌కూరకు కొవ్వును క‌రిగించే గుణాలు ఉంటాయి.. పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును క‌రిగించ‌డానికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పాల‌కూరను ఉడికించి లేదా నేరుగా కూడా తిన‌వ‌చ్చు. ఇది అదనపు కొవ్వును క‌రిగించడానికి బాగా సహాయపడుతుంది.

బీన్స్

వీటిల్లో ఫైబ‌ర్ పుష్క‌ల‌గా ఉంటుంది. ఇది కొవ్వు క‌రిగేందుకు స‌హాయ ప‌డుతుంది. స్థూల‌కాయం రాకుండా చూస్తుంది. బ‌రువును నియంత్రిస్తుంది.

బ్రోకలీ

బ్రోకలీలో అధిక నాణ్యత క‌లిగిన‌ ఫైబర్ ఉంటుంది. ఇందులో విటమిన్లు, ఖనిజాలు కూడా సమృద్ధిగా ఉంటాయి..బ్రోకోలీలో కొవ్వుతో పోరాడే ఫైటోకెమికల్స్ కూడా ఉంటాయి. బ్రోకలీలో ఉన్న ఫోలేట్ మీ శరీర భాగాల చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది.

క్యారెట్లు
క్యారెట్ల‌లో క్యాల‌రీలు త‌క్కువ‌గా ఉంటాయి. వీటిల్లో ఉండే ఫైబ‌ర్ పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును కరిగిస్తుంది. అధిక బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు, పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు క‌ర‌గాల‌నుకునేవారు నిత్యం క్యారెట్ల‌ను తినడం అలవాటు చేసుకోండి.

కీర‌దోస

కీర‌దోస‌ల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉండే వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు పోతాయి. వీటిని నేరుగా తిన‌వ‌చ్చు. నిత్యం వీటిని ఆహారంలో చాలా సుల‌భంగా తీసుకోవ‌చ్చు. వీటిని తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి ఫైబ‌ర్ అందుతుంది. అందువ‌ల్ల త్వరగా ఆకలి వేయదు.. ఫ‌లితంగా అధిక బ‌రువు త‌గ్గ‌డంతోపాటు పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు కూడా క‌రుగుతుంది.

మీకు కూడా పొట్ట దగ్గర కొవ్వు ఉంటే.. ఈ కూరగాయలను తినండి.. ఆల్కాహాల్‌, సిగిరెట్‌ అలవాటు ఉంటే వాటికి కాస్త దూరంగా ఉండండి. నిత్యం త‌గినంత నిద్ర‌పోవాలి. అతిగా ఆహార ప‌దార్థాల‌ను తినవద్దు.. శ‌రీరానికి అవ‌స‌రం ఉన్నంత మేరే భోజ‌నం చేయాలి. ఒత్తిడిని త‌గ్గించుకోవాలి. జంక్ ఫుడ్‌, నూనె ప‌దార్థాలు తిన‌రాదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version