పాదాల పగుళ్లు తో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఇది మీకోసం..!

Join Our Community
follow manalokam on social media

సాధారణంగా చాలా మందికి పాదాలు పగిలి పోతుంటాయి. కొందరికి అయితే కాళ్లు పగిలిపోయి రక్తం కూడా వస్తుంది. పట్టించుకోకపోతే మరింత దారుణంగా తయారవుతుంది. కాబట్టి ముందు నుంచే శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యమని నిపుణులు చెప్తున్నారు. వాటిపై కాస్త శ్రద్ధ పెట్టి మొదట్లోనే మాజిశ్చరైజర్ వాడడం వంటివి చేయాలి. ఇక్కడ కొన్ని హోమ్ టిప్స్ వున్నాయి. వాటిని అనుసరిస్తే తగ్గించుకోవడానికి వీలవుతుంది. ఇక పూర్తిగా చూస్తే…

కనీసం రోజుకి రెండు సార్లు మాయిశ్చరైజర్ అప్లై చెయ్యండి.

మీరు మాయిశ్చరైజర్ ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొంచెం థిక్ గా ఉన్న మాయిశ్చరైజర్ ని వాడండి.

కొన్ని మాయిశ్చరైజర్ల లో స్కిన్ ని మృదువుగా చేసే గుణాలు ఉంటాయి. అంటే యూరియా, సాలిసైలిక్ యాసిడ్ లేదా ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్. ఇవి డెడ్ స్కిన్ ని తొలగిస్తాయి.

మీరు రోజూ నిద్రపోయేటప్పుడు సబ్బు నీళ్లల్లో పది నిమిషాల పాటు కాళ్ళని ఉంచండి. ఆ తర్వాత స్క్రబ్బర్ ని ఉపయోగించి డెడ్ స్కిన్ ని తొలగించండి.

అలాగే పెట్రోలియం జెల్ లేదా ఆయిల్ బేస్డ్ క్రీమ్ ను ఉపయోగించడం మంచిది. ఇలా ఏదైనా మాయిశ్చరైజర్ను అప్లై చేసి నిద్రపోయేటప్పుడు కాటన్ సాక్స్ ని వేసుకోండి.

అంతే కానీ వాటిని మీరు వాటంతట అవే తగ్గి పోతాయి కదా అని నిర్లక్ష్యం చేయకండి. అలా వదిలేసే కొద్దీ అవి మరింత తీవ్రంగా మారిపోతాయి. పైగా ఇన్ఫెక్షన్ రిస్కు కూడా ఎక్కువైపోతుంది ఒకవేళ ఇలా హోమ్ రెమెడీస్ కనుక పని చేయలేదు అంటే అప్పుడు మీరు డాక్టర్ ని కన్సల్ట్ చేయండి.

TOP STORIES

రెండు మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందా? నిపుణులు ఏం చేబుతున్నారు?

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఒక్కరోజులో రెండులక్షలకి పైగా కేసులు వస్తున్నాయి. ముందు ముందు ఇది మరింత పెరిగే...