మీ కిచెన్ సింక్ కూడా జామ్ అవుతోందా..? అయితే ఈ సింపుల్ టిప్స్ మీకోసమే..!

-

ఆడవాళ్లు వంటింట్లో పనులు చేసి అలసిపోతూ ఉంటారు. ఒక్కోసారి డబల్ పనులు అయిపోతుంటాయి. కిచెన్ సింక్ జామ్ అయితే బాగా ఇబ్బందిగా ఉంటుంది. క్లీన్ చేయడానికి కూడా కష్టంగా ఉంటుంది. కిచెన్ సింక్ జామ్ అవుతున్నట్లయితే కొన్ని ఇంటి చిట్కాలు హెల్ప్ చేస్తాయి. ఇలా చేస్తే మాత్రం కిచెన్ సింక్ ని ఈజీగా క్లీన్ చేసుకోవడానికి అవుతుంది. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుందంటే..? కొన్ని కొన్ని సార్లు మనం ఆహార పదార్థాలు, వ్యర్ధాలు పైపులోకి వెళ్ళిపోయి. జామ్ అయిపోతాయి. దాంతో వాటర్ వెళ్ళదు. జామ్ అయిపోతుంది.

ప్లాస్టిక్ బాటిల్ పైభాగాన్ని కట్ చేసి మీరు సింక్ పై పెట్టి నొక్కితే నీళ్లు బయటకి వస్తాయి. ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. లేదంటే మీరు బాటిల్ కింది భాగాన్ని కట్ చేసి రంధ్రాలు చేయాలి. ఆ తర్వాత సింక్ పక్కన దానిని ఫిక్స్ చేసి ఏదైనా వేస్ట్ ఉన్నప్పుడు అందులో వేయాలి. అప్పుడు వాటర్ సింక్ లోకి వెళ్ళిపోతుంది. వైర్ హ్యాంగర్ తో కూడా క్లీన్ చేసుకోవచ్చు.

వైర్ హ్యాంగర్ ని మీరు కొంచెం వచ్చి పైపులో పెట్టి క్లీన్ చేయొచ్చు. ఇది కూడా ఈజీగా అయిపోతుంది. సోడియం బైకార్బొనేట్ వేసి వేడి నీళ్లు పోస్తే సులువుగా క్లీన్ అయిపోతుంది. జిడ్డు, చెత్త అంతా కూడా క్లీన్ అయిపోతుంది. బేకింగ్ సోడా, హైడ్రోజన్ పెరాక్సైడ్ మిక్స్ చేసి సింక్ లో వేసి ఒక 15 నిమిషాలు అలా వదిలేసి తర్వాత హాట్ వాటర్ తో క్లీన్ చేస్తే సులువుగా క్లీన్ అయిపోతుంది. సింక్లో మీరు పాత్రలని పెట్టినప్పుడు అందులో వేస్ట్ ఏమీ లేకుండా చూసుకొని ఆ తర్వాత అందులో పెట్టడం వలన ఏమీ అడ్డుపడవు. జామ్ అవ్వవు.

Read more RELATED
Recommended to you

Latest news