విద్వేషాలను రగిలించే వారికి దేశాన్ని ఇవ్వకూడదు : డిప్యూటీ సీఎం భట్టి మార్క

-

అదానీ, అంబానీల దోపిడీ వ్యవస్థకు చెక్ చేపట్టాల్సిన అవసరం ఉన్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. జార్ఖండ్ రాష్ట్రం రాంఘర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. అదానీ, అంబానీ వంటి కొద్ది మంది క్రోనీ క్యాపిటలిస్ట్ నుంచి జార్ఖండ్ కు విముక్తి కల్పించాలని కోరారు. ఇండియా కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి.. ప్రజా స్వామ్యాన్ని కాపాడాలని కోరారు. ఏఐసీసీ అగ్రనేత మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో రాహుల్ గాంధీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా జోడో యాత్ర చేసి దేశంలోని ప్రజా స్వామిక శక్తులను ఏకం చేశారని పేర్కొన్నారు.

విద్వేషాలను రగిలించే వారికి దేశాన్ని ఇవ్వకూడదనే లక్ష్యంతో రాహుల్ ఉన్నారన్నారు. విశాల భారతదేశంలో ప్రేమ అనే దుకాణం తెరిచి అన్ని జాతులు, మతాలకు సమాన అవకాశాలు ఇవ్వాలనేది రాహుల్ టార్గెట్ అన్నారు. దేశంలోని వనరులు, సంపద, ప్రభుత్వ రంగ సంస్థలు ఈ దేశ ప్రజలకే చెందాలని కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news