నిమ్మరసంతో ఇలా బరువు తగ్గచ్చు..!

-

చాలా మంది బరువు తగ్గాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీరు కూడా బరువు తగ్గాలనుకుంటున్నారా..?, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించడం లేదా..? అయితే తప్పకుండా దీని కోసం మీరు తెలుసుకోవాలి. ఈ విధంగా మీరు అనుసరిస్తే తప్పకుండా బరువు తగ్గొచ్చు. మరి ఆలస్యమెందుకు దీని కోసం ఇప్పుడే పూర్తిగా చూసేద్దాం.నిమ్మ వల్ల ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. ఎన్నో ప్రయోజనాలను మనం పొందొచ్చు. అయితే నిమ్మరసం కలిపి తీసుకోవడం వల్ల సులువుగా బరువు తగ్గొచ్చు.

 

నిమ్మరసం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి..?

నిమ్మరసం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. నిమ్మరసం వల్ల జీర్ణ ప్రక్రియ ఇంప్రూవ్ అవుతుంది. అదే విధంగా విటమిన్స్ కూడా మనకి అందుతాయి. కొవ్వు కరగడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది.

నిమ్మ లో ఫైబర్, పొటాషియం, విటమిన్ సి, విటమిన్ బి6, సిట్రిక్ యాసిడ్ ఉంటాయి. ఫ్రీరాడికల్స్ నుండి ప్రొటెక్ట్ చేయడం మాత్రమే కాకుండా గుండె ఆరోగ్యానికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. అయితే నిమ్మలో ఉండే ఫ్లవనోయిడ్స్ మెటబాలిజంని పెంచి బరువు తగ్గిస్తాయి. ఇన్ఫ్లమేషన్ సమస్య కూడా వుండదు. బ్లడ్ ప్రెషర్ ని కూడా కంట్రోల్ చేస్తుంది.

ఎలా తయారు చేసుకోవాలి..?

ఉదయం పూట మీరు నిమ్మరసం తాగడం వల్ల చక్కటి ప్రయోజనాలు పొందవచ్చు. దీని కోసం ముందుగా నీళ్ళని వేడి చేసి దానిలో ఒక స్పూన్ నిమ్మరసం వేసి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి కొన్ని నిమ్మకాయ ముక్కలు వేసి మరిగించాలి. ఆ తర్వాత ఈ నీటిని వడకట్టి అందులో ఒక స్పూన్ తేనె వేసుకుని తీసుకుంటే సరిపోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news