ఆరోగ్యం బాగుండాలంటే పోషక విలువలు ఉన్న ఆహారాన్ని తప్పకుండా తీసుకోవాలి. ఎప్పుడైతే శరీరానికి సరైన పోషకాలు అందుతాయో, ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ముఖ్యంగా కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం వలన కొన్ని విటమిన్ల ను పొందవచ్చు. అయితే, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఆహారంలో మార్పులను చేయడం ఎంతో అవసరం. విటమిన్ డీ పోషక లోపం ఉన్నవారు కోసం కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవచ్చు. సహజంగా, విటమిన్ డీ ను సూర్యరశ్మి ద్వారా పొందవచ్చు. కానీ, సూర్యరశ్మి లేని సమయంలో విటమిన్ డీ ని పొందాలంటే, ఈ ఆహార పదార్థాలను తీసుకోవాలి అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
విటమిన్ డీ కోసం కోడిగుడ్డులో పచ్చసొనను తీసుకోవాలి. దీనిలో విటమిన్ డీ పుష్కలంగా ఉంటుంది. కనుక వీటిని తినడం ద్వారా విటమిన్ డీ ని పొందవచ్చు. అంతేకాకుండా, సాల్మన్ వంటి చేపలలో ఒమేగా ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. దీంతో పాటుగా విటమిన్ డీ ని కూడా పొందవచ్చు. సూర్యకిరణాల నుంచి వచ్చే యూవీ కిరాణాల వలన పుట్టగొడుగుల్లో విటమిన్ డీ పెరుగుతుంది. కనుక, విటమిన్ డీ ను పొందాలంటే తప్పకుండా పుట్టగొడుగులను ఆహారంలో భాగంగా తీసుకోవాలి.
శాకాహారులు విటమిన్ డీ ని సులభంగా పొందాలంటే బాదం పాలు, సోయా పాలు వంటివి తీసుకోవాలి. ఈ పాలు తాగడం వలన విటమిన్ డీ ను పుష్కలంగా పొందవచ్చు.కాడ్ లివర్ ఆయిల్లో విటమిన్ డీ చాలా ఎక్కువగా ఉంటుంది. వీటిని సప్లిమెంట్ల రూపంలో కూడా తీసుకోవచ్చు, దీంతో విటమిన్ డీ ను పొందుతారు. వీటితో పాటుగా తాజా పండ్లు, కూరగాయలను ప్రతిరోజు తీసుకోవాలి. దీంతో కాల్షియం ను కూడా ఎక్కువగా పొందవచ్చు, పైగా విటమిన్ డీ కూడా పొందుతారు. విటమిన్ డీ లోపం లేకపోయినా ఈ ఆహార పదార్ధాలను తీసుకుని పోషక లోపం రాకుండా జాగ్రత్తపడాలి.