పుచ్చకాయ గింజలతో ఎన్ని ప్రయోజనాలో మీకు తెలుసా…?

-

సాధారణంగా అందరూ పుచ్చకాయలని తినడానికి ఇష్టపడుతుంటారు, పుచ్చకాయ వల్ల కలిగే ప్రయోజనాలు అందరికీ తెలిసినదే. కానీ పుచ్చకాయ గింజల్లోని ఉన్న ప్రయోజనాలు తెలియవు. దీనిలో అన్నీ ఇన్ని కావు… ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మరి ఆలస్యమెందుకు వాటి కోసం ఇప్పుడే పూర్తిగా తెలుసుకోండి. పుచ్చ గింజల లో అనేక పోషకాలు ఉన్నాయి. వీటిలో విటమిన్ బి సమృద్ధిగా ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల ఎన్నో సమస్యలు తరిమికొట్టొచ్చు.

పుచ్చకాయ గింజల వల్ల లైకోపీస్ అనే పదార్థం పురుషుల్లో వీర్య కణాల ఉత్పత్తిని పెంచుతుంది. పుచ్చకాయ గింజల వల్ల చాలా పోషకాలు లభిస్తాయి. అంతే కాదు మీరు వీటిని తీసుకోవడం వల్ల గుండె జబ్బులు ముప్పు నుండి బయట పడవచ్చు. మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే కూడా తగ్గిపోతాయి. ఈ గింజలని టీ లా చేసుకొని తాగడం వల్ల కిడ్నీ లో ఏర్పడే రాళ్లు కూడా కరిగిపోతాయి.

జ్ఞాపక శక్తి పెరగడానికి ఏకాగ్రతని పెంపొందించడానికి కూడా ఇవి బాగా సహాయపడుతాయి. అయితే పుచ్చకాయ గింజలు టీ ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం… పుచ్చకాయ లో ఉండే గింజల్ని తీసుకుని… వాటిని ఎండబెట్టండి. ఎండిపోయిన ఆ గింజలు తీసుకొని పొడి మాదిరి చేసుకోండి. ఇప్పుడు రెండు లీటర్ల నీటిలో రెండు టేబుల్ స్పూన్ పుచ్చకాయ గింజలు పొడి వేసి పావుగంట సేపు మరిగించండి. దీనిని నిల్వ ఉంచుకుని రెండు రోజుల పాటు తాగొచ్చు. ఇలా చేయడం వల్ల ఈ సమస్యలు దూరం అయిపోతాయి.

Read more RELATED
Recommended to you

Latest news