కంది పప్పు తింటే దేశం ఆరోగ్యంగా ఉంటుందన్న కేంద్ర మంత్రి…!

-

పప్పు” మన ఆహారంలో దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది. పప్పుకి చాలా ప్రాధాన్యత ఇస్తారు భారతీయులు. దేశంలో ఏ మూలకు వెళ్ళినా సరే పప్పుకి చాలా విలువ ఉంటుంది. శుభకార్యం అయినా ఏది అయినా సరే పప్పు ఉండాల్సిందే. అయితే దీనికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు వైద్యులు. పప్పు వలన ఆరోగ్య సమస్యలు కొన్ని దూరమవుతాయని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు.

తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ కంది పప్పు ఉపయోగాలను చెప్పి ఆశ్చర్యపరిచారు. ఏ ఆహారం తింటే మంచిదో చెప్తూ ఒక ట్వీట్ చేసారు ఆయన. ప్రధానంగా మాంసకృత్తులు (ప్రోటీన్స్) ఉండే కందిపప్పును రోజూ ఎందుకు తినాలో తన ట్వీట్ లో ప్రజలకు చెప్పారు. మనందరికీ కందిపప్పు అంటే ఇష్టమే అన్న ఆయన, రోజువారీ బాడీకి కావాల్సిన ఫైబర్‌ను కప్పులో,

నాలుగో వంతు కందిపప్పు ఇస్తుందని వివరించారు. అదే విధంగా కందిపప్పు వలన జీర్ణక్రియ మెరుగవుతుంది, మలబద్ధకం సమస్య తీరుతుందని చెప్పారు. అంతే కాకుండా గుండెకు సంబంధించిన సమస్యల్ని కందిపప్పు నివారిస్తుందని, గుండెకు వ్యాధులు రాకుండా కాపాడుతుందని, అందువల్ల ప్రతీ ఒక్కరూ కందిపప్పు తినాలనీ, తద్వారా ఆరోగ్యకరమైన భారత్‌ సాధ్యమవుతుందని చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news