పెరుగులో ఉల్లిపాయలు కలుపుకుని తినొచ్చా..? తింటే ఏం అవుతుంది..?

-

చాలా మంది పెరుగులో ఉల్లిపాయల్ని కలుపుకొని తినడానికి ఇష్టపడతారు. అలా తినడం మంచిదేనా..? ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు వస్తాయి..? లేదంటే ఉపయోగాలు ఏమైనా కలుగుతాయా అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం.. చాలామంది ఈ కాంబినేషన్ ఇష్టపడతారు. ఆయుర్వేదం ప్రకారం ఉల్లి పెరుగు కలిపి అస్సలు తినకూడదు. ఎందుకంటే ఇలా చేస్తే ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కోవాలి. ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలు ఎదుర్కోవాలి. ఉల్లిపాయ, పెరుగు రెండు విభిన్న ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఉల్లిపాయ వేడి చేసే ప్రభావాన్ని కలిగి ఉంటుంది.

పెరుగు చలువ చేసే ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అలాగే ఉల్లిపాయల్లో చూసినట్లయితే సల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి పెరుగులో ఉన్న కాల్షియం వంటి పోషకాలని శరీరం గ్రహించడానికి ఆటంకం కలిగిస్తాయి. పెరుగు, ఉల్లిపాయని కలుపుతూ ఉండడం వలన సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఉల్లిపాయల్లో ఉండే సమ్మేళనాలు గ్యాస్ట్రిక్, ఎసిడిటీ వంటి సమస్యలు వచ్చేలా చేస్తాయి.

పెరుగులో ఉండే సమ్మేళనాలు కూడా ఇంచుమించు ఇదే ప్రభావాన్ని కలిగిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో రెండు తినడం వలన ఉబ్బరం, గ్యాస్టిక్ తో పాటుగా పలు సమస్యలు వస్తాయి అలాగే శరీరంలో అధిక వేడి ఉత్పత్తి అవుతుంది. ఇది టాక్సిన్స్ లెవెల్స్ ని పెంచుతుంది చర్మం పై దద్దుర్లు, తామర, సోరియాసిస్ వంటి చర్మ సమస్యలు కూడా కలుగుతాయి. అలాగే ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలు కూడా వస్తాయి. ఉల్లిపాయల్ని పెరుగులో కలుపుకోవాలంటే వేయించి కలుపుకోవచ్చు. ఇలా చేయడం వలన ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version