ఫ్యాటీ లివ‌ర్ అంటే ఏమిటి ? క‌నిపించే ల‌క్ష‌ణాలు, తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు ఏవి..?

-

ఫ్యాటీ లివ‌ర్ నిజానికి రెండు ర‌కాలు. ఆల్క‌హాలిక్ ఫ్యాటీ లివ‌ర్ అందులో మొద‌టిది. మ‌ద్యం ఎక్కువగా సేవించ‌డం వ‌ల్ల ఈ వ్యాధి వ‌స్తుంది. ఇక రెండోది నాన్ ఆల్క‌హాలిక్ ఫ్యాటీ లివ‌ర్.

మ‌న శ‌రీరం లోప‌లి భాగంలో ఉన్న అవ‌య‌వాల్లో అతిపెద్ద అవ‌య‌వం.. లివ‌ర్‌.. ఇది మ‌న శ‌రీరంలో అనేక జీవ‌క్రియ‌ల‌ను నిర్వ‌హిస్తుంది. మ‌నం తీసుకునే ఆహారాల్నింటినీ జీర్ణం చేయ‌డంలో కాలేయం ముఖ్య పాత్ర పోషిస్తుంది. అలాగే శ‌రీరంలో ఎప్ప‌టిక‌ప్పుడు పేరుకుపోయే వ్య‌ర్థ ప‌దార్థాల‌ను లివ‌ర్ బ‌య‌ట‌కు పంపుతుంది. అయితే మ‌నం చేసే ప‌లు పొర‌పాట్లు, పాటించే జీవ‌న‌శైలి, తీసుకునే ఆహారం.. వంటి అనేక కార‌ణాల వ‌ల్ల లివ‌ర్‌కు అనేక స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. వాటిల్లో ఒకటి ఫ్యాటీ లివ‌ర్ స‌మ‌స్య‌.. దీని గురించిన వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఫ్యాటీ లివ‌ర్ నిజానికి రెండు ర‌కాలు. ఆల్క‌హాలిక్ ఫ్యాటీ లివ‌ర్ అందులో మొద‌టిది. మ‌ద్యం ఎక్కువగా సేవించ‌డం వ‌ల్ల ఈ వ్యాధి వ‌స్తుంది. ఇక రెండోది నాన్ ఆల్క‌హాలిక్ ఫ్యాటీ లివ‌ర్. ఇది అధిక బ‌రువు ఉండ‌డం, కొలెస్ట్రాల్ ఎక్కువ‌గా ఉండ‌డం, డ‌యాబెటిస్‌.. వంటి కార‌ణాల వ‌స్తుంది. అయితే ఈ రెండింటిలో ఏ స‌మ‌స్య వ‌చ్చినా రోగులలో ప‌లు ల‌క్ష‌ణాలు కనిపిస్తాయి. అవేమిటంటే… ఆకలి లేకపోవడం, వాంతులు, వికారం, క‌డుపునొప్పి త‌దిత‌ర ల‌క్ష‌ణాలు కనిపిస్తాయి. అలాగే కొన్ని సంద‌ర్భాల్లో కామెర్ల వ్యాధి ఉన్నా ఫ్యాటీ లివ‌ర్ వ‌స్తుంది. ఈ క్ర‌మంలో వ్యాధిని నిర్ల‌క్ష్యం చేస్తే పేగుల్లో ర‌క్త‌స్రావం అవుతుంది. లివ‌ర్ క్యాన్స‌ర్ వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. లివ‌ర్ ఫెయిల్ అయ్యేందుకు కూడా చాన్స్ ఉంటుంది.

పైన తెలిపిన ల‌క్ష‌ణాలు ఎవ‌రిలో అయినా ఉంటే ఏ మాత్రం నిర్ల‌క్ష్యం చేయ‌రాదు. వెంట‌నే డాక్ట‌ర్‌ను క‌లిసి చికిత్స తీసుకోవాలి. రోగుల‌కు ఉన్న ఫ్యాటీ లివ‌ర్ ఎలాంటిదో డాక్ట‌ర్ ప‌లు వైద్య ప‌రీక్ష‌ల అనంత‌రం నిర్ణ‌యిస్తాడు. దీంతో డాక్ట‌ర్ సూచ‌న మేర‌కు మందులు వాడుకోవాలి. అలాగే జీవ‌న‌శైలిలో మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా ఆహార ప‌దార్థాల విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు పాటించాలి.

* ఫ్యాటీ లివ‌ర్ స‌మ‌స్య ఉన్న‌వారు అధిక బ‌రువును త‌గ్గించుకునే ప్ర‌య‌త్నం చేయాలి. బరువు ఎక్కువ‌గా లేనివారు బ‌రువు పెర‌గ‌కుండా చూసుకోవాలి.
* డ‌యాబెటిస్ వ‌ల్ల ఫ్యాటీ లివ‌ర్ వ‌చ్చింద‌ని భావిస్తే.. అలాంటి వారు ఎల్ల‌ప్పుడూ షుగ‌ర్ లెవ‌ల్స్‌ను అదుపులో ఉంచుకోవాలి.
* శ‌రీరంలో కొవ్వు శాతం త‌గ్గించుకునే య‌త్నం చేయాలి. ఎప్ప‌టికప్పుడు డాక్ట‌ర్ సూచ‌న మేర‌కు లిపిడ్ ప్రొఫైల్ టెస్టు చేయించుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉన్న కొలెస్ట్రాల్, ట్రైగ్లిజ‌రైడ్ల శాతాన్ని తెలుసుకుని కొవ్వు పెర‌గ‌కుండా జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు.
* మద్యం సేవించ‌డం పూర్తిగా మానేయాలి. లేదా తాగ‌డం త‌గ్గించుకోవాలి.
* తృణ ధాన్యాలు, తాజా పండ్లు, కూర‌గాయలను ఎక్కువగా తింటే లివ‌ర్ శుభ్రంగా మారుతుంది. లివ‌ర్ వ్యాధులు త‌గ్గుతాయి.
* ఎక్కువ‌గా శాకాహారం తీసుకోవాలి. రోజుకు క‌నీసం 30 నిమిషాల పాటు అయినా వ్యాయామం చేయాలి. ఈ సూచ‌న‌లు పాటిస్తే ఫ్యాటీ లివ‌ర్ స‌మ‌స్య నుంచి త్వ‌ర‌గా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు..!

Read more RELATED
Recommended to you

Exit mobile version