హార్ట్ఎటాక్ కి కార్టియాక్ అరెస్ట్ కి మధ్య తేడా ఏంటో తెలుసా..!

-

బాలివుడ్ నటుడు సిద్ధార్థ్ శుక్లా హఠాత్ మరణం..యావత్ సినీ ఇండ్రస్టీనే దిగ్ర్భాంతికి గురిచేసింది. నాలుగుపదుల వయసులోనే హార్ట్ఎటాక్ తో మరిణించటంతో..వైద్య నిపుణుల్లో వందప్రశ్నలకు దారితీస్తోంది. గుండెజబ్బులకు ప్రధాన కారణం..కొలస్ట్రాల్ లేదా పోషకాహార లోపం. గుండె వైఫల్యం లేదా కార్డియాక్ యాటాక్ తో మన బంధువులు ఎవరైనా..తక్కువ వయసులోనే మరణించటం అనేది కుటుంబాల్లో తీరనిలోటును మిగులుస్తుంది.

కార్డియాక్ అరెస్ట్ , గుండెపోటు ఈ రెండూ వ్యాధులతో మనిషి తన జీవితాన్ని కోల్పోతాడు అనటంలో సందేహం ఏం లేదు. మనలో చాలామందికి తెలియని విషయం..కార్డియాక్ అరెస్ట్, గుండెపోటు రెండు వేర్వేరని.

గుండెపోటు మరియు కార్డియాక్ అరెస్ట్ కు మధ్య తేడా ఏంటి?

కార్డియాక్ అరెస్ట్, హార్ట్ ఎటాక్ అనేవి రెండు వేర్వేరు పదాలు. గుండెకు రక్త ప్రవాహం ఆగినప్పుడు గుండెపోటు వస్తుంది, ఏదైనా కారణం వల్ల గుండె పనిచేయకపోవడం, ఊహించని విధంగా కొట్టుకోవడం, ఆగిపోయినప్పుడు గుండె ఆగిపోవడం జరుగుతుంది. హార్ట్ ఎటాక్ మరియు కార్డియాక్ అరెస్ట్ మధ్య ముఖ్యంగా ఉన్న తేడా ఏంటంటే.. సర్కులేషన్ సమస్య వల్ల హార్ట్ ఎటాక్ వస్తే..ఎలక్ట్రానిక్ సమస్య వల్ల కార్డియాక్ అరెస్ట్ అవుతుంది.

గుండెపాటును మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ అని కూడా అంటారు. గుండెలోని ధమనులు బ్లాక్ అయినప్పుడు..గుండెపోటు వస్తుంది. దానివల్ల రక్తం గుండెకు చేరదు. ఫలితంగా గుండె భాగాలకు రక్తం సమయానికి అందదు. ఇది అకాల మరణానికి దారితిస్తుంది. ఈ పరిస్థితిలో చికిత్స ఆలస్యం అయితే..బాధపడుతున్న వ్యక్తికి నష్టం జరిగే ప్రమాదం ఉంది.

రక్తనాళం అడ్డంకి పూర్తిగా లేదా పాక్షికంగా ఉంటుంది. ఒకవేళ కొరోనరీ ఆర్టరీకి పూర్తి అడ్డంగి ఏర్పడితే..ఆ వ్యక్తి STEMI గుండెపోటుతో బాధపడుతున్నారని అర్థం, అంటే ST- ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్‌ఫ్రాక్షన్. ఇలా కాకుండా..పాక్షిక అడ్డంకి ఉన్నట్లయితే, రోగి NSTEMI గుండెపోటును ఎదుర్కొంటున్నారని అర్థం-ST- నాన్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్.

గుండెపోటు లక్షణాలు ఎలా ఉంటాయి..

గుండెపోటు లక్షణాలు చాలా తక్కువగా..సాదాగా ఉంటాయి..అందుకే మనుషులకు ఒకేవళ గుండెనొప్పి వచ్చినా..దానిని గుర్తించక..ఏ గ్యాస్ నొప్పో లేదా ఇంకేదో అనుకుని సొంతవైద్యాలు చేస్తుంటారు. కానీ. ఇక్కడ మనం బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఛాతి నొప్పి ఎక్కువ నిమిషాలు ఉన్నా , ఛాతి ఎగువ శరీరభాగాలకు అసౌకర్యం లేదా ఏదో అడ్డుపడుతుందనే భావన కలుగుతుంది. ఒక్కోసారి..ఛాతీలో ఎలాంటి అసౌకర్యం ఉన్నా లేకపోయినా శ్వాసలోపం మరియు చల్లని చెమట, వికారంతో పాటు తేలికపాటి తల నొప్పి కూడా వస్తే..అది గుండెపోటు వచ్చే లక్షణాలలో ఒకటని బల్లగుద్ది చెప్పవచ్చు.

కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటి?

మనం ముందు గుండెపోటుకు కొన్ని సంకేతాలు ఉంటాయని చెప్పుకున్నాం..కానీ కార్టియాక్ అరెస్ట్ లో ఇవేవి ఉండవు. హఠాత్తుగా సంభవిస్తుంది. గుండెపోటు వచ్చిన తరువాత కొలుకునే సమయంలో కూడా ఇది రావొచ్చు. అయితే గుండెపోటు కార్డియాక్ అరెస్ట్ కు దారితీస్తుంది అనుకోవటం తప్పు. అలా కచ్చితంగా జరుగుతుంది అని చెప్పటానికి ఇప్పటివరకూ ఎలాంటి ఆధారాలు లేవు. కొన్ని సందర్భాల్లో మాత్రమే ఇది కూడా సంభవిస్తుంది.

ఇది సాధారణంగా ఎప్పుడు వస్తుందంటే…గుండెకొట్టుకోవటంలో అంతరాయం ఏర్పడినప్పుడు లేదా..గుండెకొట్టుకునే పద్దతి చెదిరినప్పుడు జరుగుతుంది. కార్డియోమయోపతి, గుండె వైఫల్యం, అరిథ్మియాస్, వెంట్రిక్యులర్ ఫైబ్రిలేషన్ మరియు లాంగ్ క్యూ-టి సిండ్రోమ్ అని పిలువబడే గుండె కండరాలు మందంగా ఉంటాయి.

కొన్ని నిమిషాల్లో చికిత్స చేస్తే కార్డియాక్ అరెస్ట్ నుంచి కోలుకోవచ్చు. అటువంటి రోగికి దగ్గరగా ఉన్న ఎవరైనా తక్షణమే CPR చేయాలి. మనం చూసే ఉంటాం..ఎవరైనా హఠాత్తుగా కిందపడితే..తక్షణమే ఛాతిమీద చెయ్యిపెట్టి గట్టిగా నొక్కుతుంటారు. దాంతో గుండె సాధారణ స్థితికి వచ్చి మనిషి లేచే అవకాశం ఉంది.

కార్డియాక్ అరెస్ట్ లక్షణాలు ఎలా ఉంటాయి?

కార్డియాక్ అరెస్ట్ యొక్క ప్రధాన లక్షణం స్పృహ కోల్పోవడం లేదా స్పందించలేకపోవటం. రోగులు ఛాతీలో అసౌకర్యం, వివరించలేని పరిస్థితిని ఎదుర్కొంటారు. శ్వాసలోపం లేదా గుండెకొట్టుకునే తీరు ఒక క్రమంలో ఉండదు. ఇది గమనించి వెంటనే వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది.

ఏదేమైనా..ఈ రెండు వ్యాధులు చాలా ప్రమాదకరమైనవే..నష్టం జరిగాక బాధపడేకంటే..వాటి నుంచి తప్పించుకోవాటని సరైన ఆరోగ్యనియమాలు పాటించాలి. ఆహారం విషయంలో జాగ్రత్తలు, వ్యాయామం వంటివి చేయటం మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news