డయాబెటిస్, కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారు అరికెలను తినాలి. వీటి వల్ల శరీర రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అలాగే క్యాన్సర్ రాకుండా ఉంటుంది.
ప్రస్తుతం చాలా మంది ఆరోగ్యం కోసం చిరుధాన్యాలను (మిల్లెట్స్) ఎక్కువగా తింటున్నారు. అరికెలు, సామలు, ఊదలు, కొర్రలు.. ఇలా రక రకాల చిరు ధాన్యాలు అందుబాటులో ఉండడంతో చాలా మంది తమ ఇష్టానికి అనుగుణంగా వాటిని కొనుగోలు చేసి రోజూ ఒకటి లేదా రెండు పూటలు వాటినే ఆహారంగా తీసుకుంటున్నారు. అయితే ఏయే అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఏయే చిరుధాన్యాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
రాగులు…
వీటితో అంబలి, జావ, రాగిముద్ద, రాగిరొట్టె చేసుకుని తినవచ్చు. శరీరానికి రాగులు చలవ చేస్తాయి. ఎండకాలంలో వీటిని తీసుకుంటే శరీరానికి చల్లదనం కలుగుతుంది. అలాగే రక్తం బాగా తయారవుతుంది. శరీరానికి శక్తి లభిస్తుంది.
కొర్రలు…
అధిక బరువుతో ఇబ్బందులు పడేవారు కొర్రలను వండుకుని తినాలి. దీని వల్ల బరువు త్వరగా తగ్గవచ్చు. వీటిని తినడం వల్ల జీర్ణ సమస్యలు ఉండవు. గుండె జబ్బులు రావు. కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
సామలు…
మైగ్రేన్ సమస్య ఉన్నవారు సామలను వండుకుని తినాలి. ఇవి శరీరానికి పోషకాలను అందిస్తాయి. ఎముకలు, నరాలు దృఢంగా మారుతాయి. పేగు క్యాన్సర్ రాదు. బాలింతల్లో పాలు ఎక్కువగా తయారయ్యేలా చేస్తాయి.
ఉలవలు…
కిడ్నీ స్టోన్లు ఉన్నవారు ఉలవలను తినాలి. వీటి వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మూత్ర సంబంధ సమస్యలు పోతాయి.
అరికెలు…
డయాబెటిస్, కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారు అరికెలను తినాలి. వీటి వల్ల శరీర రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అలాగే క్యాన్సర్ రాకుండా ఉంటుంది.
ఊదలు…
మలబద్దకం, జీర్ణ సమస్యలు, డయాబెటిస్ ఉన్నవారు ఊదలను తింటే ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు.
జొన్నలు…
జొన్నలను తినడం వల్ల జీర్ణ సమస్యలు ఉండవు. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. క్యాన్సర్ రాకుండా ఉంటుంది.
సజ్జలు…
అధిక బరువు, డయాబెటిస్ సమస్యలు ఉన్నవారు సజ్జలను తింటే ఫలితం ఉంటుంది. వీటి వల్ల జీర్ణ సమస్యలు నయమవుతాయి. రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు.
మీకు ఈ సమాచారం నచ్చితే ఈ లింక్‌ను ఇతరులకు షేర్ చేయండి..!