గూస్ బంప్స్ ఎందుకు వస్తాయి..? ఓహో ఇదా కారణం…!

-

కొంతమందికి కొన్నిసార్లు గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. ఏదైనా సినిమా చూసినప్పుడు కానీ ఎప్పుడైనా ఊహించనివి జరిగినప్పుడు కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. భయానికి గురైనా, ఆశ్చర్యానికి గురైనా కూడా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అయితే, ఇలా రోమాలు నిగ్గబొడుచుకోవడాన్ని గూస్ బంప్స్ అంటారు. చర్మం పై ఉండే ప్రతీ వెంట్రుకను సపోర్ట్ చేయడానికి ఓ కండరం ఉంటుంది. అదే ఎర‌క్టర్ పిలి. ఎప్పుడైతే ఈ కండరాలు సంకోచిస్తాయో అక్కడ చర్మం దగ్గరకు వస్తుంది. వెంట్రుకలు పైకి లేవడం జరుగుతుంది.

మెదడులో కణాలు బయట జరిగిన ఏదైనా సంఘటన లేదా విషయం కారణంగా షాక్ అయినప్పుడు ఈ విధంగా జరుగుతుంది. అనుకోని సంఘటనలు ఎప్పుడైనా జరిగితే, మెదడు శరీరాన్ని అప్రమత్తం చేయాలని, అప్పుడు రక్తం వేగంగా పెరిగి చర్మం కండరాలు టైట్ గా అయిపోతూ ఉంటాయి.

ఈ కారణంగా వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. ఎప్పుడైనా ఏదైనా హఠాత్తుగా జరిగితే షాక్ ని తట్టుకోవడానికి మెదడు ముందు తయారు చేస్తుంది. ఈ కారణంగా గూస్ బంప్స్ వస్తాయి. గూస్ బంప్స్ ని గూస్ పింపుల్స్ లేదా చిల్లి బంప్స్ అని కూడా పిలుస్తారు. సైంటిఫిక్ గా చూసినట్లయితే దీనిని పిలో మోటార్ రిఫ్లెక్స్ అని పిలుస్తారు. చాలా రకాల జీవులలో ఇలా జరుగుతూ ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version