ఐస్ క్రీం తిన్న తర్వాత ఎందుకు దాహం వేస్తుంది..? కారణం ఏంటో తెలుసా..?

-

చాలా మంది ఐస్ క్రీమ్స్ ని తినడానికి ఇష్టపడుతుంటారు. ఎండాకాలంలో అయితే ఐస్ క్రీమ్స్ కి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఐస్ క్రీమ్స్ తిన్న తర్వాత గమనించినట్లయితే దాహం ఎక్కువ వేస్తుంది. ఐస్ క్రీమ్స్ తిన్నాక ఎందుకు దాహం ఎక్కువ వేస్తుంది..? దాని వెనుక కారణం ఏంటి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఐస్ క్రీమ్ తిన్నా కదా దాహం వేయడానికి కారణం ఏంటో మీరు గమనించారా..? ఇలా మీకు మాత్రమే జరుగుతుందని అనుకుంటారా..? అయితే అందరికీ ఇది జరుగుతుంది. తిన్న తర్వాత దాహం వేసినా నీరు తాగకూడదు.

ఐస్ క్రీం తిన్నాక ఎందుకు దాహం వేస్తుంది అంటే ఐస్ క్రీమ్ లేదా స్వీట్లు తిన్న తర్వాత దాహం వేయడం వెనుక శాస్త్రీయ కారణం ఉంది, పరిశోధన ప్రకారం ఐస్ క్రీమ్ లో షుగర్ సోడియం రెండు ఉంటాయి, ఐస్ క్రీమ్ తిన్నాక రక్తంలో సోడియం, చక్కెర రెండు కలుస్తాయి. చక్కెర మన రక్తంలోకి ప్రవేశించాక అది శరీరం అంతటా వ్యాపించడం ప్రారంభమవుతుంది. దీని తర్వాత అది మన శరీరంలోని కణాల నుంచి నీటిని పీల్చుకోవడం మొదలుపెడుతుంది.

మన మెదడు ఈ మొత్తం ప్రక్రియని అర్థం చేసుకుంటుంది. మెదడులో చిన్న భాగానికి సంకేతాలను పంపిస్తుంది. దీనిని హైపో తేలామస్ అంటారు. ఈ సందేశమే మన శరీరానికి నీరు అవసరమని భావించేలా చేస్తుంది. అందుకని దాహం వేస్తుంది. ఐస్ క్రీమ్ తిన్నాక నీరు మాత్రం తాగొద్దు. అలా తాగితే గొంతు నొప్పి, దంత సమస్యలు వస్తాయి. తిన్న తర్వాత 15 నిమిషాలు ఆగి ఆ తర్వాత మాత్రమే తాగండి.

Read more RELATED
Recommended to you

Latest news