దారుణం.. ఆస్పత్రి బిల్లు కట్టేందుకు బిడ్డను అమ్మేసిన తండ్రి!

-

ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం జరిగింది.కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రి తన సంతానం పట్ల పాశవికంగా ప్రవర్తించాడు. ఏకంగా సొంత బిడ్డను అమ్ముకున్నాడు. ఆస్పత్రి బిల్లు చెల్లించేందుకు డబ్బులు లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం యూపీలో చర్చనీయాంశంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

వివరాల్లోకివెళితే.. ఆస్పత్రి బిల్లు చెల్లించేందుకు ఓ తండ్రి తన మూడేళ్ల చిన్నారిని అమ్మేశాడు.తన భార్య ఆస్పత్రిలో మూడో బిడ్డకు జన్మనివ్వగా బిల్లు చెల్లిస్తేనే ఇంటికి పంపుతామని యాజమాన్యం పేర్కొంది. దీంతో తన మూడేళ్ల కొడుకును అమ్మకానికి పెట్టాడు. ఇది కాస్త స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని తిరిగి తల్లిదండ్రులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news