వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రా..

-

హైదరాబాద్‌ పరిధిలోని చెరువులు, నాలాలు, కుంటల పరీరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హైడ్రా వ్వవస్థను తీసుకొచ్చిన విషయం తెలిసిందే.ఈ సంస్థ తన పనిని తాను చేసుకుంటూ ముందుకు దూసుకుపోతోంది.ప్రభుత్వం నుంచి ఫుల్ సపోర్టు ఉండటంతో అధికార,ప్రతిపక్షం అని తేడా లేకుండా చెరువు ప్రాంతాల స్థాలాలను ఆక్రమించి కట్టిన కట్టడాలను హైడ్రా కూల్చివేస్తోంది.ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో కట్టిన కట్టడాలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తోంది.ఇలాంటి వ్యవస్థ జిల్లాల్లోనూ తేవాలని కొందరు సామాజిక,పర్యావరణ వేత్తలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

తాజాగా సంగారెడ్ది జిల్లా అమీర్ పూర్‌లోని పెద్ద చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌లలో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. ఇందులో అక్రమంగా నిర్మాణాలు చేసిన పాణ్యం వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి చెందిన భవనాలను తొలగిస్తున్నారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి మరీ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news