బంగారం కంటే విలువైన వయాగ్రా.. కిలో 70 లక్షలు..!

-

తులం బంగారం ధర ప్రస్తుతం 33000 రూపాయలు, వయాగ్రా ధర 25 నుండి 100 రూపాయలు. ఇదేం వయాగ్రానో ఏమో గానీ తులం 7000 రూపాయలు కిలో 70లక్షలట.. దీని పేరు యర్సగుంబా. ఇది భారత్‌, నేపాల్‌, భూటాన్‌, టిబెట్లోని హిమాలయాల్లో దొరుకుతుంది. అందుకే దీన్ని హిమాలయన్‌ వయాగ్రా అని కూడా అంటారు.
నాటు వైద్యంలో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ యర్సగుంబా నపుంసకత్వం, కేన్సర్‌, ఆస్తమాలకు మంచి ఔషధంగా పనిచేస్తుందని నాటు వైద్యుల మాట. గొంగలి పురుగే యర్సగుంబాగా మారుతుంది. నేలలో ఉండే ఒకరకమైన ఫంగస్‌ సోకి చనిపోయిన గొంగలి పురుగునే యర్సగుంబా అంటారు. దీన్ని హిమాలయన్‌ వయాగ్రా, నేచురల్‌ వయాగ్రా అని అంటారు.
మరి ఈ వయాగ్రా గురించి ఇంకాస్త వివరంగా తెలుసుకుందామా..

యర్సగుంబా ఎక్కడ దొరుతాయి..

ఇది హిమాలయా ప్రాంతంలో విరవిగా లభిస్తాయి, అక్కడ ఉండే కొండజాతి ప్రజలు ఈ యర్సగుంబాలను వెదికే పనిలో పడతారు. మే, జూన్‌ నెలల్లో వేలాదిమంది ప్రజలు యర్సగుంబా వేటలో ఉంటారు. వారి వార్షికాదాయంలో 56 శాతం యర్సగుంబా అమ్మగా వచ్చినవే కావడం గమనార్హం. ఒక్కో యర్సగుంబా వేల 250-300 రూపాయలు వరకు విక్రయిస్తారు. గతంలో ఒక్కోరోజు కనీసం 100 యర్సగుంబాలు దొరికేవని, ఇప్పుడు రోజుకు 2 నుండి 20 దొరకడం కూడా కష్టంగా మారుతోందని అక్కడి వారు చెబుతున్నారు. మారుతున్న వాతావరణం, భూతాపం వల్ల యర్సగుంబాల లభ్యత తగ్గిపోతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

యర్సగుంబా వేట ప్రాణాలు పణంగా పెట్టాల్సిందే..

యర్సగుంబా వేట అంటే మామూలు విషయం కాదు, ఇవి 3 వేల నుంచి 5 వేల మీటర్ల ఎత్తులో పెరుగుతుంది. కానీ అంత ఎత్తులో వీటిని సేకరించడం ప్రాణాలతే చెలగాటమాడడమే. చలి చాల ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి హిమాలయ కొండ చరియలు విరిగి పడటం జరుగుతుంది. ఉన్నట్టుండి వర్షం కురవటం వల్ల అక్కడ చిక్కుకున్న సందార్బాలూ ఉన్నాయంటూ తమ అనుభవాలు చెబుతారు యర్సగుంబా కోసం పనిచేసేవారు.

అమెరికా, ఇంగ్లండ్‌, చైనా, సింగపూర్‌, జపాన్‌, కొరియా, థాయ్‌లాండ్‌ దేశాలకు వీటిని ఎక్కువగా ఎగుమతి చేస్తారు. ఆయా దేశాల్లో తులం విలువ రూ.7000 ఉంటుంది. స్త్రీ పురుషులలో శృంగార శక్తి పెరగడానికి, వీర్యవృద్ధికి, రోగనిరోధక శక్తి పెరగడానికి, శరీర శక్తి, కండరాలకు బలం చేకూరడానికి దీన్ని ఉపయోగిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news