గుడ్లు ఫ్రెష్ గా ఉన్నాయో లేదో ఇలా ఈజీగా తెలుసుకోవచ్చు..!

-

గుడ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. గుడ్లు లో ఎన్నో పోషకాలు ఉంటాయి. అయితే గుడ్లు తీసుకునేటప్పుడు అవి తాజాగా ఉన్నాయా లేదా అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు నిజంగా ప్రతిరోజు గుడ్లు తీసుకుంటే ఆరోగ్య బాగుంటుంది. అందుకని చాలామంది ప్రతిరోజూ ఒక గుడ్డును తీసుకుంటూ ఉంటారు. అయితే గుడ్లని ఎంపిక చేసుకునేటప్పుడు కచ్చితంగా అవి తాజాగా ఉన్నాయా లేదా అని చూసుకుని తీసుకోవాలి. లేకపోతే అనవసరంగా అనేక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.

eggs

గుడ్లలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి గుడ్లు మంచి పౌష్టిక ఆహారం. ఒక మధ్యస్థ గుడ్డులో ఆరు గ్రాముల దాకా ప్రోటీన్ ఉంటుంది, ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా ఇది చూసుకుంటుంది. ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. గుడ్లు తినడం వలన కండరాల బలహీనత సమస్య నుండి బయటపడొచ్చు. అయితే పాడైపోయిన గుడ్లని ఎలా గుర్తించాలి మంచి గుడ్లు ఎలా ఎంపిక చేసుకోవాలి అనే విషయానికి వచ్చేస్తే, పాడైపోయిన గుడ్లను గుర్తించడానికి ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని దానిలో గుడ్డు వేయండి.

గుడ్డు కనుక అడుగుకి వెళ్ళిపోతే అవి తాజావి అని మనం గుర్తించొచ్చు అదే ఒకవేళ గుడ్డు మధ్యలో నిలబడినట్లైతే అది పాడైపోయింది అని తెలుసుకోవచ్చు. గుడ్డు నీళ్లలో పైకి తేలుతున్నట్లు అయితే కచ్చితంగా గుడ్డును తీసుకోవద్దు. తాజా గుడ్లు ఎప్పుడు నీటి కిందకి వెళ్లిపోయి మునిగిపోతాయి. తేలిపోవు. ఇలా సులభంగా మీరు గుడ్డు పాడయిందా లేదంటే తాజాగా ఉందా అని గుర్తించొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news