సాధారణంగా బయటకు వెళ్ళినప్పుడు రోడ్డు మీద కనిపించిన కొబ్బరి బొండాల దగ్గరికి చాలామంది వెళ్ళిపోతుంటారు. కొబ్బరినీళ్లు ఆరోగ్యకరమని తాగుతుంటారు. అయితే కొన్ని విషయాలు తెలుసుకోకుండా కొబ్బరి నీళ్లు తాగకూడదు. కొబ్బరి నీళ్లు ఆరోగ్యకరమే.. కానీ అందరికీ కాదు. కొంతమంది కొబ్బరినీళ్ళకు దూరంగా ఉండాలి. వాళ్ళు ఎవరో తెలుసుకుందాం.
కిడ్నీ సమస్యలు ఉన్నవారు:
కొబ్బరి నీళ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. అందువల్ల కిడ్నీ సమస్యలున్నవాళ్లు కొబ్బరి నీళ్ళకు దూరంగా ఉండటం మంచిది. శరీరంలో పొటాషియం స్థాయిలు పెరిగిపోయి హైపర్ కాలేమియా వచ్చే అవకాశం ఉంది.
చక్కెర వ్యాధులు ఉన్నవారు:
కొబ్బరి నీళ్లలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. అందువల్ల డయాబెటిస్ తో బాధపడేవారు దీనికి దూరంగా ఉండటమే ఉత్తమం. దీనివల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం లేకపోలేదు.
జీర్ణ సంబంధ సమస్యలు ఉన్నవారు:
కొబ్బరి నీళ్లు తాగితే కడుపులో కొందరికి అసౌకర్యంగా అనిపించే అవకాశం ఉంది. అంతేకాదు, కడుపుబ్బరం, డయేరియా వంటి సమస్యలు కూడా రావచ్చు. దీనికి కారణం కొబ్బరినీళ్ళలో ఫైబర్ ఇంకా చక్కెర ఎక్కువగా ఉండటమే. పడని ఆహారం తినడం వల్ల కడుపులో అసౌకర్యంగా అనిపించే లక్షణాలు ఉన్నట్లయితే కొబ్బరినీళ్ళకు దూరంగా ఉండటం ఉత్తమం.
బరువు తగ్గాలనుకునేవారు:
శరీర బరువును కంట్రోల్లో ఉంచాలనుకునే వాళ్ళు కొబ్బరినీళ్ళకు దూరంగా ఉండాలి. ముందే చెప్పినట్టు ఇందులో చక్కెర ఎక్కువగా ఉంటుంది.
ఇంకా అలర్జీలు ఉన్నవారు సైతం కొబ్బరినీళ్ళకు దూరంగా ఉండటమే మంచిది.
గమనిక: ఈ సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది, కేవలం అవగాహన కోసం మాత్రమే. “మనలోకం” ధృవీకరించడలేదు. పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.