చ‌లికాలంలో కివీ పండ్ల‌ను క‌చ్చితంగా తినాలి.. ఎందుకంటే..?

-

చ‌లికాలం వ‌ల్ల చాలా మంది త‌మ శ‌రీరాల‌ను వెచ్చ‌గా ఉంచుకునేందుకు య‌త్నిస్తున్నారు. ఇందు కోసం వారు శ‌రీరానికి వేడినిచ్చే ఆహారాల‌ను తింటున్నారు. అయితే చ‌లికాలంలో చ‌లి స‌మ‌స్య‌తోపాటు చ‌ర్మం ప‌గులుతుంది. అలాగే సీజ‌న‌ల్ వ్యాధులు కూడా వ‌స్తుంటాయి. అలాంట‌ప్పుడు శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే ఆహారం తీసుకోవాలి. దీంతో వ్యాధులు రాకుండా ఉంటాయి. ఇక అలాంటి ఆహారాల్లో కివీ పండ్లు అత్యుత్త‌మమైన‌వి అని చెప్ప‌వ‌చ్చు.

కివీ పండ్ల‌ను చ‌లికాలంలో త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాలి. వీటిల్లో విట‌మిన్ సి పుష్క‌లంగా ఉంటుంది. అందువ‌ల్ల చ‌లికాలంలో మ‌న శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. సీజ‌న‌ల్ వ్యాధులు రాకుండా ఉంటాయి. అలాగే చ‌ర్మం సుర‌క్షితంగా ఉంటుంది. చ‌ర్మం ప‌గ‌ల‌కుండా మృదువుగా ఉంటుంది.

కివీ పండ్ల‌లో విట‌మిన్ ఇ, ఫోలేట్‌, పొటాషియం త‌దిత‌ర పోష‌కాలు ఉంటాయి. ఇవి వైర‌ల్ ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా చూస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గుతాయి. హైబీపీ త‌గ్గుతుంది. కివీలో ఉండే పోష‌ఖాలు శ‌రీరంలో కొవ్వును చేర‌కుండా చూస్తాయి. దీంతో బ‌రువు నియంత్ర‌ణ‌లో ఉంటుంది.

చ‌లికాలంలో స‌హ‌జంగానే చాలా మందిలో జీర్ణ క్రియ స‌రిగ్గా జ‌ర‌గ‌దు. అలాంట‌ప్పుడు మ‌ల‌బ‌ద్ద‌కం వ‌స్తుంది. దీన్ని నివారించాలంటే కివీ పండ్ల‌ను తినాలి. అలాగే కివీ పండ్ల‌ను పేస్ట్ గా చేసి ఫేస్ ప్యాక్‌లా వేసుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది. చ‌లికాలం వ‌ల్ల చ‌ర్మం ప‌గ‌ల‌కుండా ఉంటుంది. ముఖం ప్ర‌కాశిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version