దగ్గు తగ్గటానికి అద్భుతమైన చిట్కాలు ఏంటో తెలుసా..!

-

ఈ రోజుల్లో చాలా మందిని చాలా సందర్భాల్లో వేధిస్తున్న సమస్య దగ్గు. దగ్గు మామూలుగా రెండు రోజులు ఉండి పోయేది.కానీ కొందరికి దగ్గు వచ్చినప్పుడు ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. దీనికి కారణం రసాయనాలు గల పానీయాలు తాగడం, దుమ్ము, ధూళి నుంచి వచ్చే కాలుష్యం. వయసుతో సంబంధం లేకుండా వచ్చే ఈ దగ్గు తగ్గడానికి కొన్ని కొన్ని చిట్కాలు ఉన్నాయి. ఎలా వాడాలో తెలుసుకుందాం.

దగ్గు ఒక ఇన్ఫెక్షన్ లాగా భావిస్తాము. కానీ అది ఒక రక్షణ ఏర్పాటు. ఇది నోటి ద్వారా గాని ముక్కు ద్వారా గాని వెళ్లే రేణువులు ఊపిరితిత్తులో కి వెళ్ళినప్పుడు అది బయటకు నెట్టి వేస్తుంది. ఊపిరితిత్తులు నుంచి వచ్చిన దుమ్ముధూళి దగ్గు రూపంలో రేణువులను బయటికి పంపే వ్యవస్థ. శ్వాసనాళంలోను, గొంతులోని ఏర్పడే రసాయనాలను బయటకి పంపిస్తుంది. దగ్గు 1,2 రోజులు వస్తే అది ఫ్లూ జ్వరం ఇన్ఫెక్షన్లుగా భావించాలి. ఇది చాలా కారణాల వల్ల రావచ్చు.ఊపిరిటీత్తులలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా, ఆస్తమా వున్నా, టీబీ, న్యూమోనియా, IlD వున్నా దగ్గు వారాల తరబడి నెలల తరబడి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.అలాగే త్రోట్ ఇన్ఫెక్షన్ వున్నా, సైనస్ సమస్య వున్నా దగ్గు ఎక్కువుగా వస్తుంది.రెండు వారాలు దగ్గు తో పాటు కఫమ్ కూడా వచ్చింది అంటే ఊరికే తగ్గించాలి అని కాకుండా ఎందుకు వస్తుందో అని డాక్టర్ని కలిసి కారణం తెలుసుకొని చికిత్స తీసుకోవాలి. ఎక్కువగా దగ్గు వస్తోంది అంటే శరీరం ఏదో ఒక భాగం తీవ్రమైన అనారోగ్యం పాలు కాబోతునట్లు సూచికలుగా భావించాలి.

చిన్న పిల్లల్లో సాధారణంగా కనిపిస్తుంటుంది. వీరికి తేనే ఇవ్వడం వల్ల దగ్గు తగ్గే అవకాశం ఉంటుంది. హైబీపీ వంటి సమస్యలకు వాడే మందుల వల్ల కూడా కొన్నిసార్లు దగ్గు విపరీతంగా వేధిస్తుంటుంది. ఎక్కువగా దగ్గు వచ్చేటప్పుడు ఏమి తినకముందే ఉప్పు వేసిన నీరు పుక్కిలించాలి.ఉప్పులో వుండే అయోడిన్ కు దగ్గును తగ్గించే గుణం ఉంటుంది.మిరియాలు, ఉప్పు నమిలి మింగడం కానీ, లేకుంటే మిరియాలతో చేసిన వంటలు కానీ ఎక్కువ గా తినాలి. వెల్లుల్లిలో వుండే పోషకాలకు దగ్గు తగ్గించే గుణం ఉంటుంది.రాత్రి పూట తలగడ ఎత్తుగా ఉండేలా చూసుకోవాలి. పసుపు, తులిసి వాడడం వల్ల ఇందులో వుండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఇన్ఫెక్షన్ లను తగ్గిస్తాయి.రాత్రి పూట ఒక టేబుల్ స్పూన్ తేనెను తీసుకుంటూ ఉండాలి.

Read more RELATED
Recommended to you

Latest news