అక్కడ మరుగుదొడ్డి వాడిన వారికి ఉచితంగా ఐదు రూపాయలిస్తారు..!

-

సాధారణంగా మనం సులభ్ కాంప్లెక్స్ లలో మరుగుదొడ్డి ఉపయోగించినందుకు వారికే డబ్బులు ఇవ్వాలి కదా. కానీ.. అక్కడ మాత్రం మరుగుదొడ్డి వాడి ఐదు రూపాయలు జేబులో వేసుకొని వెళ్లొచ్చు. అరె.. ఈ పథకం ఏదో బాగుందే వెంటనే వెళ్లి రోజు ఓ ఐదు రూపాయలు ఉచితంగా తెచ్చుకోవచ్చని అప్పుడే ప్లాన్లు వేస్తున్నారా? ఆగండాగండి.. చెప్పేది పూర్తిగా చదవాలి కదా.

భారత్ లో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. బహిరంగ మల, మూత్ర విసర్జన నిర్మూలన కోసం ఏం చేయాలో అది చేస్తుంది ప్రభుత్వం. అయినప్పటికీ ఆశించిన ఫలితాలు రావట్లేదు. చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ బహిరంగ మల, మూత్ర విసర్జన జరుగుతూనే ఉన్నది. అందుకే గుజరాత్ లోని వల్సాడ్ నగరపాలక సంస్థ ఓ వినూత్నమైన పథకాన్ని తీసుకొచ్చింది.

దాని కోసం మొబైల్ టాయిలెట్ ను ప్రారంభించింది సంస్థ. నగర పాలక సంస్థ పరిధిలో ఆ మొబైల్ టాయిలెట్లను ప్రారంభించింది. వాటిని ఉపయోగించిన వాళ్లకు ఐదు రూపాయలు ఉచితంగా ఇవ్వాలని భావించింది. అయితే.. ఈ పథకంపై కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ పథకాన్ని తప్పు దారి పట్టిస్తారని.. వచ్చిన వాళ్లే మళ్లీ మళ్లీ వచ్చి అసలు పథకం ఉద్దేశమే నీరుగారిపోతుందని అంటున్నా… దీనిపై మరోసారి నిర్ణయం తీసుకోవడానికి నగర పాలక సంస్థ సమావేశం కానుందట. ఏది ఏమైనా ఈ పథకాన్ని మాత్రం ప్రారంభించి తీరుతామని అధికారులు అంటున్నారు. బాగుంది కదా ఐడియా. పనికి పని.. డబ్బుకు డబ్బు.

Read more RELATED
Recommended to you

Exit mobile version