అస్థిత్వ ప్ర‌తీక‌.. విజ‌య బావుట.. ఆమె పుస్త‌కం.

Join Our Community
follow manalokam on social media

“ఆమె” ఇది పుస్తకం మాత్రమే కాదు, మ‌హిళ‌ల అస్థిత్వాన్ని, వారి విజ‌యాల‌ను ప్ర‌పంచానికి తెలియ‌జెప్పే విజ‌యాల స‌మాహారం. సాధార‌ణ మ‌హిళ అసాధార‌ణ విజ‌యాల సంపుటి. అన్నీ నిజ జీవిత క‌థ‌లే. అంద‌రూ త‌మ జీవితాన్ని జీరో నుంచి ప్రారంభించిన వాళ్లే. క‌ష్టాలు, అడ్డంకులు, చీత్కారాలు అన్నీ ఎదుర్కొని త‌మంత‌ట తాము జీవితాల‌ను చ‌క్క‌దిద్దుకొని న‌లుగురికి ఆద‌ర్శంగా నిలిచిన మ‌హిళ‌ల జీవిత క‌థ‌లు ఈ పుస్త‌కంలో ఉంటాయి. 20 మంది మ‌హిళ‌ల స‌క్సెస్ స్టోరీలు ఉన్నాయి.

మ‌హిళ‌లు త‌లుచుకుంటే ఏ రంగంలో అయినా సాధికార‌త‌ను సాధించ‌గ‌ల‌ర‌ని నిరూపించేందుకు ఈ పుస్త‌కమే సాక్ష్యం. ఇందులోని మ‌హిళ‌లు వేర్వేరు రంగాల్లో విజ‌యం సాధించిన వారున్నారు. ఒక్కొక్కరిదీ ఒక్కో నేప‌థ్యం. అక్ష‌రాలు రాకున్నా ఎంచుకున్న వృత్తిలో సాధికారత చూపినవాళ్లు కొందరైతే, ఆధునిక జ్ఞానంతో సాధికారత చూపినవాళ్లు మరికొందరు. స్త్రీ కావటం పాపం అనుకునే ఎంతోమందికి అలాగే మ‌హిళ‌లు ఏమీ సాధించ‌లేరు అని భావించే ఎంతో మందికి.. జన్మంటు ఉంటే స్త్రీ గా పుట్టాలి అని క‌నువిప్పు క‌లిగించే పుస్త‌కం ఇది. కాళ్లు లేని వాళ్లు, కండ్లు లేని వాళ్లు, గ్రామీణ మ‌హిళ‌లు, ఆధునిక మ‌హిళ‌లు ఎన్ని సాధించారో కండ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపిందీ ఆమె పుస్త‌కం.

మహిళల గెలుపు ఆగకుండా ఎన్ని ఎదురుదెబ్బలు ఎదురైనా ఎదిరించి నిలిచిన జీవితాలు మనోగతాలే కనిపిస్తున్నాయి. ఆడదే కదా ఏం చేస్తుంది అనుకునే వాళ్ళకి ఆడవారు ఏమైనా చేయగలరు అని ఎన్నో జీవిత విజయాల ద్వారా వారిని పరిచయం చేస్తుంది “ఆమెష‌!! ఈ పుస్తకాన్ని మనముందుకు తీసుకొచ్చిన వినోద్ మామిడాల మహిళలు సాధించిన ఎన్నో విజ‌యాల‌ను పచ్చళ్ళ వ్యాపారం నుండి కళ్లు లేకున్నా పట్టుదలే పెట్టుబడిగా సివిల్స్ సాధించిన ప్రంజంల్ పాటిల్ వరకు అందరి తీసుకువచ్చి పరిచయం చేశారు. ఈ బుక్ మనముందు ఉంచటంలో ఆయన కృషి అనిర్వచనీయమే!! ఇది అంద‌రూ చ‌ద‌వాల్సిన పుస్త‌కం. ఇంట్లో పిల్ల‌ల నుంచి స‌మాజంలో స్థిర‌ప‌డిన ప్ర‌తి ఒక్క‌రూ తిర‌గేయాల్సిన సంక‌ల‌నం.

శ్రీలత సవిడిబోయిన
cell: 8106359735

TOP STORIES

ఉగాది స్పెషల్: ఉగాది పచ్చడి ఇలా చేస్తే అమృతంలా ఉంటుంది…!

ఈసారి ప్లవ నామ సంవత్సరం వచ్చేస్తోంది. శార్వరి నామ సంవత్సరానికి స్వస్తి పలికి ప్లవనామ సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. సాధారణంగా ఉగాది అంటే అందరికీ గుర్తొచ్చేది...