జీవితంలో మనం అనుకున్నది సాధించడం అంత సులభమైనది కాదు. అందులోనూ ఏదైనా సమస్యలు ఉంటే మరింత కష్టమవుతుంది. కానీ ఈమె మాత్రం ఒంటికాలితో పోరాడుతోంది. ఒంటరిగా ఈమె పని చేసుకుంటూ డబ్బులు సంపాదించి తన ఫ్యామిలీని పోషిస్తూ నలుగురికీ ఆదర్శంగా నిలుస్తుంది.
ఇక ఈమె గురించి పూర్తి వివరాల్లోకి వెళితే… గుజరాత్ కి చెందిన అంకితా షాకి పుట్టిన ఏడాదికి పోలియో వచ్చింది. దాంతో ఆమె కుడికాలు తీసేశారు. కేవలం ఒక కాలు మీద ఈమె ఇప్పుడు నిలబడుతుంది. ఎకనామిక్స్ లో ఈమె డిగ్రీ చేసినప్పటికీ కూడా అంగవైకల్యం కారణంగా ఉద్యోగం రాలేదు అయినప్పటికీ ఆమె నిరుత్సాహ పడలేదు.
తన కుటుంబం కోసం ఏదైనా చెయ్యాలనే పట్టుదల ఆమెను ఎప్పుడు ఖాళీగా ఉండనీయలేదు. కాల్ సెంటర్ లో జాబ్, హోటల్ లో హౌస్ కీపింగ్ పని చెయ్యడానికి కూడా వెనకాడలేదు. తన కంటే చిన్నవరైన 9 మందిని పోషించాలి మరి.
చిన్నపటినుండే ఎన్నో కష్టాలను చూస్తున్న అంకితా షాకి ఆమె తండ్రి మరణంతో కష్టాలు రెట్టింపయ్యాయి.
జాబ్ చేస్తే తన ఫ్యామిలీని చూసుకునే సమయం ఉండదు. తనకున్న సమయంలో డబ్బులు సంపాదిస్తూ, కుటుంబాన్ని కూడా చూసుకోవాలి. అందుకు సరైన పని చెయ్యాలి. తను సొంతంగా ఆటో నడపాలని నిశ్చయించుకుంది.
అప్పటి నుండి కూడా ఆమె ఆటో నేర్చుకుని ఆటో నడుపుతూ నాలుగు రాళ్ళు సంపాదిస్తోంది. ఈమెకి ఒక కాలు మాత్రమే ఉండడంతో చేతులతో ఆటో ని ఆపరేట్ చేస్తోంది. క్యాబ్ సర్వీస్ ని కూడా ఈమె ఇస్తోంది. నిజంగా ఆడవాళ్ళం కదా ఏం చేస్తాము అది అనుకునే వాళ్లందరికీ ఈమె ఆదర్శంగా నిలుస్తోంది. నిజంగా మహిళలందరూ కూడా ఈమెని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళితే తప్పక అనుకున్నది సాధిస్తారు.