పెద్దబాల శిక్ష చదవడం వల్ల ప్రయోజనాలు ఎన్నో…!

-

పెద్దబాల శిక్షని ఎన్సైక్లోపెడియా అనవచ్చు. పెద్ద బాలశిక్ష పుస్తకం మొత్తం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రతి తెలుగు వారు కూడా ఈ పుస్తకాన్ని తప్పక చదవాలి. బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలించిన కాలం లో ఆంధ్ర దేశంలో పాఠశాలల్లో పిల్లలకు పెద్దబాలశిక్ష సిలబస్ గా ఉండేది. అయితే అప్పట్లో పిల్లలు మొట్టమొదట తమ విద్యాభ్యాసాన్ని ఈ పెద్ద బాలశిక్ష తో ప్రారంభించే వారు. పాఠ్య పుస్తకాల లో భాగంగా ఈ పెద్ద బాలశిక్ష ఉందంటే దీని యొక్క ప్రాముఖ్యత గురించి మనం చెప్పుకొని తీరాలి.

నిజంగా ఈ పుస్తకం చాలా ముఖ్యమైంది. తెలుగు వారి అందరి ఇంట్లో కూడా ఈ పుస్తకం తప్పక ఉండాలి. అయితే పూర్వం పెళ్లి సంబంధాలు మాట్లాడినప్పుడు మీ అబ్బాయి లేదా మీ అమ్మ ఏం చదివారు అని అడిగితే మా అబ్బాయి పెద్ద బాల శిక్ష పూర్తి చేశాడని చెబితే…. మా అమ్మాయి పెద్ద బాలశిక్ష కంఠోపాఠం చేసిందని ఎంతో గర్వంగా చెప్పుకునేవారు. అయితే ఈ పుస్తకం చదవడం వల్ల ఏం వస్తుంది..? ఈ విషయం లోకి వస్తే పెద్దబాలశిక్ష గ్రంధాన్ని పూర్తిగా చదివితే ప్రపంచం లోని అన్ని విషయాల గురించి తెలుసుకున్నట్లు భావించేవారు. ఒకటా రెండా ఇందులో తెలుగు సంస్కృతి, తెలుగు కథలు, విజ్ఞాన శాస్త్రం, క్రీడలు, సాహిత్యం ఇలా అనేక విషయాల గురించి ఇందులో ఉంటుంది.

తెలుగు ఎన్సైక్లోపెడియా అనే ఈ పెద్ద బాలశిక్ష మొదట్లో అనేక మంది చదివినా ఆంగ్ల విద్యా ప్రవేశం వలన ఈ పుస్తకం కొంచెం ఆదరణ తగ్గిపోయింది కానీ ఇటీవలే మళ్లీ వెలుగులోకి రావడం విశేషం. తెలుగువారు అత్యంత ప్రియంగా ఆదరించే పుస్తకంగా దీనిని చెప్పుకోవచ్చు. కానీ తల్లిదండ్రులు కనుక పిల్లలకి ఈ పుస్తకంలో ఉన్న విషయాలు చెప్తే వాళ్లకి మంచి విలువలు, మన సంస్కృతి సంప్రదాయాలు తెలుస్తాయి. భాషపై పట్టు కూడా ఏర్పడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news