ఐఏఎస్ ఆఫీసర్ అవుతున్న బస్ కండక్టర్…!

-

సివిల్ సర్వీసెస్‌లో చేరడం అనేది చాలా మందికి ఒక కల, కాని పరీక్షా రాసి బయటపడటం అనేది జోక్ కాదు. కల కన్న౦త సులువు అంతకన్నా కాదు. కఠిన శ్రమ ఉంటేనే, ఒక పట్టుదల ఉంటేనే అది సాధ్యమవుతుంది అనేది వాస్తవం. దానికి ఎవరూ అతీతులు కారు. కాని ఒక బస్ కండక్టర్ సాధించాడు. ఉద్యోగం చేస్తూనే తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు. అవును ఇది నిజం.

బెంగళూరు మిర్రర్ కధనం ప్రకారం, యుపిఎస్సి సివిల్ సర్వీసెస్ ప్రధాన పరీక్షను క్లియర్ చేయడానికి గానూ బిఎమ్‌టిసిలో పని చేస్తున్న బస్సు కండక్టర్ మధు ఎన్‌సి రోజూ ఐదు గంటల పాటు కష్టపడ్డారు. 29 ఏళ్ల మధు… గత జూన్ లో ప్రిలిమ్స్ ని క్లియర్ చేసాడు. ఈ నెలలో ప్రకటించిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్సి) మెయిన్స్ ఫలితాల్లో తన రోల్ నంబర్ చూసినప్పుడు ఆనందంతో పొంగిపోయాడు.

మధు కుటుంబంలో మధు ఒక్కరే చదువుకున్న వ్యక్తి. రోజుకి 8 గంటలు కష్టపడి కూడా మధు సాధించిన విజయం చూసి తల్లి తండ్రులు పొంగిపోతున్నారు. తన దినచర్యను మీడియాకు వివరించాడు మధూ. తాను జీవితంలో ఒక పెద్ద విజయం సాధించాలి అనుకున్నా అని… తన కుటుంబ పోషణ కోసం తాను మొదటి నుంచి కష్టపడుతున్నా అది తన చదువుని ఏ మాత్రం ఇబ్బంది పెట్టలేదని చెప్పుకొచ్చాడు.

“నేను రోజుకు 5 గంటలు చదువుకునే వాడ్ని. నా సబ్జెక్టులు ఎథిక్స్, పొలిటికల్ సైన్స్, మ్యాథ్స్ అండ్ సైన్స్. నేను ప్రతిరోజూ, పనికి ముందు మరియు తరువాత కూడా చదువుతాను. ఉదయం 4 గంటలకు మేల్కొనడం, డ్యూటీ కి వెళ్ళే ముందు చదువుకునే వాడిని అని చెప్పాడు. అతనికి మార్చి 25 న ఇంటర్వ్యూ ఉంది. మధు ఇంటర్వ్యూ క్లియర్ చేస్తే, కండక్టర్‌గా ఉద్యోగం మానేసి, ఐఎఎస్ ఆఫీసర్‌గా ఉద్యోగం చెయ్యాలని భావిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news