ఏపీ రాజకీయాల్లో సంచలన ట్విస్ట్…!అసలు విశాఖ వద్దన్న జిఎన్ రావు కమిటీ…!

-

ఆంధ్రప్రదేశ్ రాజధాని మార్పు విషయంలో దూకుడుగా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్, రాజధాని మార్పు కోసం ఏర్పాటు చేసిన జిఎన్ రావు కమిటిలో పేర్కొన్న సంచలన విషయాలు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. అసలు ఆ కమిటి రాజధానిగా విశాఖను ఏ మాత్రం వద్దని చెప్తూ ప్రభుత్వానికి తన అభిప్రాయాన్ని స్పష్టంగా సూటిగా చెప్పింది. కాని ప్రభుత్వం మాత్రం ఆ విషయాన్ని దాచిపెట్టింది.

తాజాగా జిఎన్ రావు కమిటిలో కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. వాటిల్లో సంచలన విషయాలు ఉన్నాయి. రాజధాని మార్పుకి విశాఖ అనుకూలం అని ప్రభుత్వం చెప్తున్న మాట తప్పని తేలింది. విశాఖ చాలా అందమైన నగరం, ఇతర ప్రాంతాలతో రోడ్డు, రైల్వే, విమాన మార్గాలతో అనుసంధానం, పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందినా సరే విశాఖను రాజధానిగా ఎంపిక చేయడం సరికాదని స్పష్టం చేసింది.

అసలు విశాఖలు పెద్ద ఎత్తున ప్రభుత్వ భవనాలు ఏర్పాటు చేయడం సరికాదని స్పష్టం చేసింది. పర్యావరణ పరంగా విశాఖ ఎంతో సున్నితమైన జోన్ లో ఉందని, అతి తీవ్రమైన తుఫాన్లు, వరదలతో పాటుగా సముద్ర మట్టం పెరగడమే ముప్పు ఉందని, భూగర్భ జలాల్లోకి సముద్రపు నీరు వచ్చే అవకాశం ఉందని, విశాఖ పోర్ట్ లో భారీగా కార్యాకలాపాలు జరుగుతున్నాయని… దీని పరిసర ప్రాంతాల్లో చమురు తెట్ట ఎక్కువగా ఉందని స్పష్టం చేసింది.

విశాఖ ఉక్కు కర్మాగారం, విశాఖ పోర్టు, ఇతర సంస్థల కార్యకలాపాల నేపథ్యంలో ఇక్కడ పారిశ్రామిక కాలుష్యమే ఎక్కువగా ఉందని కమిటీ పేర్కొంది. భద్రత చూస్తే అక్కడ ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని, జలాంతర్గాములు, అణు జలాంతర్గాములకూ ఇదే కేంద్రమని చెప్పింది. అసలు విశాఖకు అభివృద్ధి ఏ మాత్రం అవసరం లేదని, ఇక ప్రభుత్వ కార్యాకలాపలకు ప్రభుత్వ భూములే లేవని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news