3 నెలలకు ఒకసారి బ్లడ్ ఇవ్వాలంటేనే చాలామంది భయపడతారు. అయ్యో 3 నెలలు ఏంది.. సంవత్సరానికి ఒకసారి కూడా ఇవ్వరు కొంతమందయితే.. కానీ.. ఈయన చూడండి… 60 ఏళ్లుగా వారానికి ఓసారి బ్లడ్ డొనేట్ చేశాడు. ఇప్పుడు ఆయన వయసు 81 ఏళ్లు. అంటే.. ఆయన 21 ఏళ్ల వయసు నుంచి ఇలా వారానికి ఒకసారి బ్లడ్ ఇస్తూనే ఉన్నాడు. అందుకే ఆయన్ను మ్యాన్ విత్ ది గోల్డెన్ ఆర్మ్ అని పిలుస్తారు. 60 ఏళ్ల నుంచి నిరంతరంగా బ్లడ్ డొనేట్ చేసిన ఆ మహానుబావుడు.. ఇటీవలే రిటైర్ అయ్యాడు.
ఆయన పేరు జేమ్స్ హారిసన్. ఊరు ఆస్ట్రేలియా. ఆయన ఇచ్చిన రక్తంతో ఇప్పటికి 2.4 మిలియన్ పిల్లలను కాపాడారు. 2.4 మిలియన్ అంటే 24 లక్షల మంది అన్నమాట.
ఎందుకంటే.. జేమ్స్ రక్తం అనేది చాలా అరుదైన రక్తం. చాలా కాదు.. అసలు ఆయనకు ఉన్న రక్తం ప్రపంచంలో మరెవరికీ లేదు. ఆయన రక్తంలో ఉన్న యాంటీ బయోటిక్స్ ను తీసుకొని యాంటీడీ అనే ఇంజక్షన్ ను తయారు చేసేవాళ్లు డాక్టర్లు. అందుకే.. ఆయన ప్రతి వారం రక్తం ఇచ్చేవాడు.
ఆస్ట్రేలియాలో గర్భిణీ మహిళలకు ఓ వింత జబ్బు వచ్చేదట. దాన్నే రెసస్ డిసీజ్ అని పిలుస్తారు. దాని వల్ల గర్భిణీల రక్తం… తమ కడుపులో ఉన్న బిడ్డ రక్తకణాలపై దాడి చేస్తాయట. దీంతో కడుపులోని బిడ్డ చనిపోవడమో లేక మెదడు సమస్యలు రావడమో.. ఇతర సమస్యలు రావడమో జరిగేదట. అందుకే.. ఆ రెసస్ వ్యాధిని అరికట్టడానికే.. ప్రెగ్నెంట్ మహిళలకు యాంటీడీ అనే ఇంజక్షన్ ఇచ్చేవారట. అందరికీ కాదు.. ఏ మహిళకైతే రెసస్ నెగెటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటుందో వాళ్లకే. ఆర్ హెచ్డీ నెగెటివ్ గ్రూప్ రక్తం వాళ్లకు.. కడుపులోని బిడ్డకు ఆర్ హెచ్డీ పాజిటివ్ ఉంటే.. ఒకరి రక్తం మరొకరి రక్త కణాలపై దాడి చేస్తుంది. అందుకే… ఆర్ హెచ్డీ నెగెటివ్ రక్తం గ్రూప్ ఉన్న మహిళలకు జేమ్స్ రక్తంతో చేసిన యాంటీడీ ఇంజిక్షన్ ను ఎక్కిస్తారు. దీంతో వాళ్లకు రెసస్ సమస్య పోతుందన్నమాట. అలా.. తనకు తెలియకుండా ఆస్ట్రేలియాలో పుట్టబోయే 24 లక్షల మంది పిల్లలకు పునర్జన్మనిచ్చాడు జేమ్స్.