మీకు మీరే బాస్…మీ ఆనందాన్ని ఇతరుల చేతిలో పెట్టద్దు..!

మనం జీవితంలో ఆనందంగా ఉండాలంటే మనకి తృప్తి కలిగే పనులు చేయాలి. ప్రతి ఒక్కరికి కూడా ఎందులోనైనా సక్సెస్ అవ్వాలని… రాణించాలని ఉంటుంది అయితే ఒక్కొక్క సారి ఎవరో చెప్పారని లేదంటే ఎవరో చేస్తున్నారని మనం వాటిని అనుసరిస్తూ ఉంటాము. నిజానికి ఇతరులు చెప్పినా ఇతరులు చేసేవి చేసినా మనకి సంతృప్తి ఉండదు దీనివలన జీవితంలో మనం ఆనందంగా కూడా ఉండలేము.

జీవితాంతం అయ్యో అలా చేశాము అని మనం తలుచుకుని బాధ పడుతూనే ఉంటాము. అయితే మనం జీవితంలో రిస్కు తీసుకున్న పర్వాలేదు కానీ మనకి నచ్చింది చేయాలి. ఓడిపోతే ఓడిపోతాము కానీ ఏదో ఒకటి నేర్చుకుంటాము కదా..? తర్వాత మనం అలా జరిగిపోయింది అని బాధపడకూడదు. ప్రతి ఒక్కరూ జీవితంలో ఆనందంగా ఉండడానికి నచ్చినది చేయాలి.

మీ జీవితానికి మీరే బాస్. అంతే కానీ ఎవరో వచ్చి మీ జీవితాన్ని రూల్ చేయడం మంచిది కాదు. మీ ఆనందాన్ని ఇతరులు కంట్రోల్ చేయకూడదు. ఒకవేళ కనుక మీ ఆనందాన్ని ఇతరులు కంట్రోల్ చేస్తున్నట్లయితే వారికి దూరంగా ఉండండి. ఒకటి గుర్తు పెట్టుకోండి ఏ బంధం కూడా శాశ్వతం కాదు. స్నేహితుడు మాటను కానీ ప్రియుడు లేదా ప్రేయసి మాటని కానీ విని ఆచరించారంటే మీ జీవితంలో ఆనందం ఉండదు. కేవలం మీకు నచ్చినది మాత్రమే మీరు చేయండి మీ జీవితానికి మీరే బాస్ అని గుర్తుపెట్టుకుని ఆనందంగా ఉండడం కోసం చూసుకోండి. మనసు చెప్పినదే నిజమైన అనందం.