కార్పొరేట్ ఉద్యోగం వదిలేసి ఈకో ఫ్రెండ్లీ బ్యాగ్స్… కోట్లలో సంపాదన..!

-

ఈ మధ్య కాలం లో ప్లాస్టిక్ వాడకం ఎక్కువైపోయింది. ప్లాస్టిక్ ని ఉపయోగించవద్దు అని చెప్పినా సరే ఇంకా ఎంతో మంది ప్లాస్టిక్ ని ఉపయోగిస్తున్నారు. అయితే ఈ జంట తమ చుట్టూ ప్లాస్టిక్ వాడకం ఎక్కువగా ఉందని గమనించి దానినే ఉపాధి మార్గంగా మలచుకోవాలని అనుకున్నారు. క్లాత్ బ్యాగ్ లను తయారు చేసి వాటిని అమ్మి డబ్బులు సంపాదిస్తున్నారు.

 

ఇక వీరి గురించి పూర్తి వివరాల్లోకి వెళితే… గౌరీనాధ్, కృష్ణ సుబ్రమనియన్ ఇద్దరు భార్యాభర్తలు. వీళ్లు ఇద్దరూ కూడా కార్పొరేట్ ఉద్యోగాలు చేసేవారు. బెంగళూరు చెన్నై లో వివిధ కార్పొరేట్ కంపెనీలలో పని చేసే గోపీనాథ్, కృష్ణ సుబ్రమనియన్ కార్పొరేట్ ఉద్యోగాలని వదిలేసి సొంతూరు వెళ్లి పోవాలని అనుకున్నారు ఆ తర్వాత వాళ్ళిద్దరూ మధురైకి వెళ్లి క్లాత్ బాగ్స్ ని తయారు చేస్తూ మంచిగా సంపాదిస్తున్నారు. ఏకంగా సంవత్సరానికి మూడు కోట్ల రూపాయలని వీళ్ళు సంపాదిస్తున్నారు. ఈ జంట 2014లో ఎల్లో బ్యాగ్ అనే సంస్థను స్థాపించారు.

రోజు రోజుకీ వీరి వ్యాపారం కూడా అభివృద్ధి చెందటం మొదలయింది. ఎనిమిదేళ్ల తర్వాత మధురై లో పూర్తి స్థాయి సామాజిక సంస్థ గా ఇది మారింది. వీళ్ళు క్లాత్ బ్యాగ్ లను ఉత్పత్తి చేయడంతో పాటు ఎంతో మందికి ఉపాధి కల్పించారు. 2019 లో ఒక ఎన్జీవో ని కూడా వీళ్ళు మొదలు పెట్టారు పత్తి, జూట్ తో వినియోగదారుల అవసరాల కోసం వివిధ రకాల బ్యాగులను వీళ్ళు సప్లై చేస్తున్నారు. ప్రొటెక్టర్ బ్యాగులు, టూట్ బ్యాగులు ఇలా రకరకాల బ్యాగులని వీళ్ళు వెబ్సైట్ల ద్వారా అమ్ముతున్నారు.

20 రూపాయల నుంచి 200 వరకు వీరి యొక్క బ్యాగులు ఉంటాయి. కేవలం మనదేశంలోనే కాకుండా యూఎస్, యూకే, ఆస్ట్రేలియాలో కూడా ఎల్లో బ్యాగులను సప్లై చేస్తున్నారు. కరోనా మహమ్మారి సమయంలో బ్యాగులు అమ్మకం బాగా తగ్గిపోవడంతో మాస్క్లను సప్లై చేశారు. పిల్లల కోసం 2019 లో ట్యూషన్ సెంటర్ ని మొదలు పెట్టారు. గ్రీన్ స్లేట్ అనే పేరుతో ట్యూషన్ సెంటర్ ని మొదలు పెట్టారు. ఇలా కార్పొరేట్ జాబ్ వదిలేసి ఈకో ఫ్రెండ్లీ బ్యాగులను అమ్ముతూ మూడు కోట్లు సంపాదిస్తున్నారు ఈ జంట.

Read more RELATED
Recommended to you

Latest news