Cable Bridge : క‌రీంన‌గ‌ర్ కేబుల్ బ్రిడ్జికి జాతీయ అవార్డు

-

క‌రీంనగ‌ర్ లో ఇటీవ‌ల తెలంగాణ‌ రాష్ట్ర ప్ర‌భుత్వం కేబుల్ బ్రిడ్జిని నిర్మించిన విషయం తెలిసిందే. ఈ కేబుల్ బ్రిడ్జీతో కరీంనగ‌ర్ రూపురేఖ‌లే మారిపోయాయి. కాగ క‌రీంన‌గ‌ర్ కేబుల్ బ్రిడ్జికి కేంద్ర ప్ర‌భుత్వ అవార్డు ద‌క్కింది. ఔట్ స్టాండింగ్ కాంక్రీట్ స్ట్ర‌క్చ‌ర్ – 2021 విభాగంలో జాతీయ స్థాయిలో అవార్డు వ‌చ్చింది. ఈ అవార్డును ఇండియ‌న్ కాంక్రీట్ ఇన్ స్టిట్యూట్ హైద‌రాబాద్ సెటంర్ ఈ అవార్డును ప్ర‌దానం చేసింది. కాగ శనివారం హైద‌రాబ‌ద్ లోని మినిస్ట‌ర్ క్వార్ట‌ర్స్ లో ఈ అవార్డును రాష్ట్ర రోడ్డు, భ‌వ‌నాల శాఖ‌కు అంద‌జేశారు.

తెలంగాణ రాష్ట్ర ప‌నితీరు ఈ అవార్డు నిద‌ర్శ‌నం అని ఆ శాఖ మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి అన్నారు. ఈ అవార్డుతో రోడ్లు, భ‌వ‌నాల శాఖ అధికారుల్లో, ఉద్యోగుల్లో నూత‌న ఉత్స‌హం వ‌స్తుంద‌ని అన్నారు. కాగ క‌రీంన‌గ‌ర్ కేబుల్ బ్రిడ్జిని తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించింది. రూ. 183 కోట్ల వ్య‌యంతో ఈ కేబుల్ బ్రిడ్జిని తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్మించింది. ఈ కేబుల్ బ్రిడ్జి 680 మీట‌ర్ల పోడువుతో ఉంటుంది. క‌రీంన‌గ‌ర్ నుంచి వ‌రంగ‌ల్, హైద‌రాబాద్ వెళ్లే వాహనాల‌కు వీలుగా ఉంటుంది. ప్ర‌ధానంగా ప‌ర్యాట‌కుల‌ను కూడా బాగా ఆక‌ట్టుకుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news